ఆ హీరోలందరూ ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి!

'బాహుబలి' సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ మార్కెట్ ను సంపాదించుకొని, పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

Update: 2024-07-19 04:35 GMT

పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సపోర్ట్ తో హీరోగా పరిచయమైన ప్రభాస్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి, టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా రాణించడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. తన ఇమేజ్ కు తగ్గట్టుగా సరైన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 'బాహుబలి' సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ మార్కెట్ ను సంపాదించుకొని, పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారనే చెప్పాలి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కథలను ఎంపిక చేసుకుంటూ వచ్చారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్, పీరియడ్ రొమాంటిక్ డ్రామా, మైథలాజికల్ యాక్షన్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, హారర్ కామెడీ.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ సినిమా సినిమాకి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడే మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొస్తున్నారు. మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు. గత రెండేళ్లలో డార్లింగ్ నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రాలే. వీటిల్లో రెండు సినిమాలు ఫ్లాప్ అయితే, మరో రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. వెంట వెంటనే సినిమాలు చేయడం వల్ల పరాజయాల ప్రభావం ఆయన కెరీర్ మీద పడటం లేదు. ఈ ప్లానింగ్ విషయంలోనే మిగతా స్టార్ హీరోలు వెనకబడిపోతున్నారు.

ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్', 'ఆది పురుష్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'సలార్' మూవీ రూ. 700 కోట్లకి పైగా వసూళ్లు రాబడితే.. ఇటీవల వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు అభిమానులు ప్రభాస్ ను 'కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్సాఫీస్'గా పిలుస్తున్నారు. ఇదంతా ఆయన ప్లానింగ్ వల్లనే సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అదే సమయంలో ఇతర పాన్ ఇండియా స్టార్లు రెండు మూడేళ్ళకు కూడా ఒక సినిమాని పూర్తి చెయ్యలేకపోతున్నారు. ఆ ఒక్క సినిమాని కూడా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు. RRR మూవీతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు.. ఇప్పటి వరకూ మరో చిత్రాన్ని అందించలేకపోయారు. తారక్ 'దేవర పార్ట్-1' మీదనే ఉన్నారు.. చెర్రీ ఇంకా 'గేమ్ ఛేంజర్' పనుల్లో ఉన్నారు.

అలానే 'పుష్ప: ది రైజ్' తో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న అల్లు అర్జున్.. అప్పటి నుంచి 'పుష్ప 2' కోసమో వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చాయో మనం చూశాం. ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ లో హను రాఘవపూడితో 'ఫౌజీ'.. డిసెంబర్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' సినిమాలను స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారు. వీటితో పాటుగా 'సలార్ 2', 'కల్కి 2' చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా ప్రభాస్ సైలెంట్ గా జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మిగతా స్టార్స్ కూడా అదే స్పీడ్ అందుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News