ప్రభాస్ ని ఇలా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు?
కానీ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే? ఆయన లేజీ నిజమేనా? అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ లో ఏ హీరో లేనంత బిజీగా ప్రభాస్ ఉన్నాడు.
డార్లింగ్ ప్రభాస్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే దర్శకుడు రాజమౌళి. ఎంతలా అంటే? 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో తనని కనీసం గెస్ట్ పాత్ర అయినా ఇవ్వాలని మీకు అనిపించలేదా? అని ఓపెన్ గా అడిగే అంత. తానెంత పెద్ద స్టార్ అయినా అన్నింటిని పక్కనబెట్టి డార్లింగ్ అలా అడగడంతోనే వాళ్లిద్దరు ఎంత క్లోజ్ అన్నది అద్దం పడుతుంది. అదే క్లోజ్ నెస్ తో రాజమౌళి డార్లింగ్ గురించి ఓ సందర్భంలా సరదాగా ఓ మాట అన్నారు.
'ఆర్ ఆర్ ఆర్' ప్రీమియర్ కి ప్రభాస్ వస్తున్నాడా? అని ఎన్టీఆర్ అంటే ప్రభాస్ ప్రీమియర్ కి కదిలి రావడమా..అది జరగదు అంటూ జక్కన్న నవ్వుతూ కరాఖండీగా చెప్పేసాడు. అప్పుడే ప్రభాస్ అంత బద్ద కస్తుడా? అన్న ఓ డౌట్ రెయిజ్ అయింది అందరిలో. ఆన్ సెట్స్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు? అన్నది తెలియదు గానీ రాజమౌళి అన్న ఆ మాట మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ లేజీ తనాన్ని ఆ మాట హైలైట్ చేసినట్లు అయింది.
కానీ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే? ఆయన లేజీ నిజమేనా? అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ లో ఏ హీరో లేనంత బిజీగా ప్రభాస్ ఉన్నాడు. అతడి సినిమాల లైనప్..కమిట్ అవుతోన్న విధా నం చూస్తే ఇదే అనిపిస్తుంది. అందులోనూ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. వాటికోసం ఆయన ప్రత్యేకంగా ఎలా సన్నధం అవుతున్నాడో? కనిపిస్తూనే ఉంటుంది. విదేశాల్లో అవసరం మేర పాత్రకి అనుగుణంగా ట్రైనింగ్ లు ఇలా ప్రతీ చోట ప్రభాస్ ఎఫెర్ట్ వంద శాతం కనిపిస్తుంది.
రెండు దశాబ్ధాల కెరీర్ లో ఇప్పటికే 24 సినిమాలు పూర్తి చేసాడు. మరో ఐదు చిత్రాలు లైన్ లో పెట్టాడు. వాటిలో 'కల్కి 2898' మేలో రిలీజ్ అవుతుంది. 'రాజాసాబ్' ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసు కుంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.' కల్కీ'..'రాజాసాబ్'..'సలార్' మూడు సినిమా షూటింగ్ లకు ఒకేసారి హాజరైన సందర్భాలున్నాయి. అలాగే మంచు విష్ణు నటిస్తోన్న 'కన్నప్ప' లో లార్డ్ శివ రోల్ పోషిస్తున్నాడు.
త్వరలో 'సలార్ -2' షూటింగ్ మొదలు వుతుంది. అలాగే సెప్టెంబర్ నుంచి 'స్పిరిట్' కూడా పట్టాలె క్కించబోతున్నారు. మరోవైపు రీసెంట్ గా హను రాఘవపూడితో ఏకంగా ఓ వరల్డ్ వార్ సినిమా చేయడానికి కమిట్ అయినట్లు ప్రచారం సాగుతుంది.