ప్ర‌భాస్ అభిమానులకు నిద్ర ప‌ట్ట‌డం లేదా?

`స‌లార్` త‌ర్వాత `క‌ల్కి 2898` తో మ‌రో భారీ విజ‌యం డార్లింగ్ ప్ర‌భాస్ ఖాతాలో ప‌డిపోయింది.

Update: 2024-07-04 11:30 GMT

`స‌లార్` త‌ర్వాత `క‌ల్కి 2898` తో మ‌రో భారీ విజ‌యం డార్లింగ్ ప్ర‌భాస్ ఖాతాలో ప‌డిపోయింది. `ఆదిపురుష్` వ‌ర‌కూ వ‌రుస ప‌రాజ‌యాలు చూసిన ప్ర‌భాస్ ఒకేసారి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని రేసులో మ‌ళ్లీ నేనే అనేసాడు. క‌ల్కి -2 రిలీజ్ అన్న‌ది మ‌రో మూడేళ్ల త‌ర్వాత మాట‌. ఇప్ప‌ట్లో ఆ సినిమా టాపిక్ కూడా ఉండ‌దు. మ‌రి త‌దుప‌రి ప్ర‌భాస్ ప్లానింగ్ ఏంటి? అంటే ఉందిగా `రాజాసాబ్` అనుకోవ‌చ్చు. ఇది ఎలాగూ పూర్తి చేసే ప్రాజెక్ట్ . కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది కాబ‌ట్టి ఎలా లేదన్నా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డం ఖాయం.

మ‌రి క‌మిట్ అయిన మిగ‌తా సినిమాల సంగ‌తేంటి? అంటేనే వ‌చ్చిన స‌మ‌స్య‌గా క‌నిపిస్తుంది. `స‌లార్-2`, `స్పిరిట్`, `హ‌నురాఘ‌వ‌పూడి` చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ముందుగా ఏది ప‌ట్టాలెక్కుతుంది? అంటే దేనిక‌దే హైలైట్ అవుతుంది. స‌లార్ రిలీజ్ అనంత‌రం 15 నెల‌ల్లోనూ పూర్తి చేసి రిలీజ్ చేస్తామ‌నే స‌రికి స‌లార్-2 ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మ‌నుకున్నారు. కానీ అంది ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు.

ఆ త‌ర్వాత ఆగ‌స్టు నుంచి హ‌నురాఘ‌వ‌పూడి వార్ ల‌వ్ స్టోరీకి డార్లింగ్ డేట్లు కేటాయించిన‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది. అలాగే స్పిరిట్ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభమ‌వుతుంద‌ని..వీలైంతే ఇంకా ముందుగానే లాంచ్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా అన్నాడు. కానీ ఏది ఇంత వ‌ర‌కూ ప్రారంభం కాలేదు. ఏది ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో కూడా తెలియ‌ని గంద‌ర‌గోళంలో అభిమానులు సైతం ప‌డ్డారు.

Read more!

డార్లింగ్ త‌ర్వాత రిలీజ్ చేసే భారీ యాక్ష‌న్ చిత్ర‌మేది? అంటే అభిమానులు క్లారిటీ గా చెప్ప‌లేక పోతున్నారు. `రాజాసాబ్` సంగ‌తి ప‌క్క‌న‌బెడితే? మిగ‌తా మూడు సినిమాలు భారీ అంచ‌నాలున్న‌వే. భారీ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్లే. దీంతో ఏది ముందు ప్రారంభ‌మ‌వుతుందో? అర్దం కాని గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని అభిమానులంటారు. దీనిపై ప్ర‌భాస్ క్లారిటీ ఇస్తే ఈ ర‌క‌మైన క‌న్ ప్యూజ‌న్ ఉండ‌దంటున్నారు. మ‌రి ఇదంతా డార్లింగ్ గ‌మ‌నిస్తున్నాడో? లేదో.

Tags:    

Similar News

eac