స‌లార్ నిర్మాత‌ల‌పై ఫ్యాన్స్ వీరంగం

`స‌లార్` సెప్టెంబర్‌లో విడుద‌ల కాక‌పోవ‌డంపై ప్ర‌భాస్ అభిమానులు ఇప్ప‌టికే గుర్రుమీదున్నారు.

Update: 2023-11-05 07:07 GMT

`స‌లార్` సెప్టెంబర్‌లో విడుద‌ల కాక‌పోవ‌డంపై ప్ర‌భాస్ అభిమానులు ఇప్ప‌టికే గుర్రుమీదున్నారు. నెల‌ల‌ త‌ర‌బ‌డి ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కార‌ణం హోంబ‌లే సంస్థ అని కూడా భావిస్తున్నారు. అయితే భారీత‌నం నిండిన సినిమా కావ‌డంతో ప్ర‌తిదీ డిలే త‌ప్ప‌డం లేదు. వీ.ఎఫ్.ఎక్స్ స‌హా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా డిసెంబర్ 22కి స‌లార్ వాయిదా పడింది. అయితే ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ కి జ‌నంలో అద్భుత స్పంద‌న వ‌చ్చినా ఆ త‌ర్వాత బ‌జ్ ని పెంచేందుకు చిత్ర‌బృందం ఎలాంటి ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ని రిలీజ్ చేయ‌లేదు. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల స‌రైన పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ ఏదీ రాలేదు. క‌నీసం ప్ర‌భాస్ బ‌ర్త్ డే రోజున అయినా ఏదైనా ప్ర‌త్యేక గిఫ్ట్ ఇస్తార‌ని భావించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.

ఈ చిత్రంపై భారీ అంచనాలకు త‌గిన‌ట్టుగా హోంబ‌లే సంస్థ ఆశించిన విధంగా ప్ర‌చారం చేయ‌డం లేదన్న ఆరోప‌ణ‌లున్నాయి. దీనివ‌ల్ల స‌లార్ ఓపెనింగ్స్ ప‌డిపోతాయ‌నే ఆందోళ‌న అభిమానుల్లో ఉంది. థియేట్రికల్ ట్రైలర్ గురించి ఇంకా ఎలాంటి వార్త లేదు. ప్రభాస్ పుట్టినరోజున కూడా క‌నీసం పోస్ట‌ర్ అయినా విడుద‌ల చేయ‌క‌పోవ‌డం రిలీజ్ తేదీ గురించి ప్ర‌స్థావించ‌క‌పోవ‌డంతో అభిమానులు సీరియ‌స్ గా ఉన్నారు. హోంబలే ఫిల్మ్స్ ఎలాంటి టీజింగ్ అప్ డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ లో నెగెటివిటీ స్ప్రెడ్ అయిపోతోంది. తీవ్ర అసహనానికి గురైన అభిమానులలో కొంద‌రు ప్రతికూల హ్యాష్‌ట్యాగ్ ల‌ను షేర్ చేస్తూ ఆ అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఉప‌యోగం లేని హోంబ‌లే ఫిలింస్ (#UseLessHomableFilms) అంటూ హ్యాష్ ట్యాగ్ ని ఉప‌యోగిస్తూ త‌మ అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం X వేదిక‌పై ఇది ట్రెండ్ అవుతోంది. చాలా మంది అభిమానులు ఈ ట్రెండ్‌లో చేర‌డ‌మే గాక‌.. ఇప్పుడు సలార్ మేక‌ర్స్ ని లక్ష్యంగా చేసుకుని వేలాది ట్వీట్లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ప్రతికూల ధోరణి ప్ర‌శాంత్ నీల్ కి హోంబ‌లే వారికి క‌నువిప్పు అవుతుందా? లేదా అన్న‌ది చూడాలి.

ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం?

పాన్ ఇండియా మూవీ `స‌లార్` కథ ఇప్ప‌టికే లీక్ కావడం విశేషం. 1000 మంది ప్రత్యర్థులపై భారీ పోరులో తండ్రీ కొడుకు పాత్ర‌లు (ప్రభాస్ ద్విపాత్రాభినయం) విరుచుకుప‌డ‌తాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విజయవంతమైన `కెజిఎఫ్` సిరీస్ వెనుక ఉన్న బృందం మద్దతుతో హోంబలే నిర్మించిన ఈ చిత్రం సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింద‌ని టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు లీకైన కథనం అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది.

స‌లార్‌లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక ప్రత్యేక సన్నివేశంలో ఒక ప్రభాస్ పాత్ర వెయ్యి మంది శత్రు సైన్యం చుట్టుముట్టేసిన‌ప్పుడు పోరాటంలో ఊహించ‌ని ట్విస్ట్ ఉంటుంద‌ని తెలిసింది. ప్రీక్లైమాక్స్ లో వ‌చ్చే ఈ ఎపిసోడ్ లో కొడుకుని రక్షించడానికి తండ్రి (మరో ప్రభాస్) పాత్ర వస్తుంది. తండ్రి కొడుకుల క‌ల‌యిక ఒక్క‌సారిగా హీట్ పెంచేస్తుంది అంటూ ఒక ప్ర‌చారం ఊపందుకుంది.

అయితే స‌లార్ కి సంబంధించిన ఎటాంటి లీక్ లు లేకుండా చిత్ర‌బృందం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. నిజానికి స‌లార్ కి సంబంధించి ఎలాంటి లీక్ లు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని బస్రూర్ స్టూడియోలో చేయిస్తున్నార‌ని సమాచారం. లీకులు లేకుండా సురక్షితంగా ఉంచే ప్రయత్నమిద‌ని తెలిసింది. రవి బస్రూర్ స్టూడియోలో సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని చాలా జాగ్రత్తగా రూపొందించారు. బ్లాక్‌బస్టర్ ల కోసం ఇటువంటి ముందస్తు చర్యలు అసాధారణం కాదు. ఎందుకంటే కథ లీక్‌ల ప్రమాదం ఇప్పుడు పెను స‌మ‌స్య‌. కార‌ణం ఏదైనా ఇప్ప‌టివ‌ర‌కూ స‌లార్ కి సంబంధించిన ఎలాంటి లీక్ లు బ‌య‌టికి రాలేదు. అందుకే క‌నీసం ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ అయినా చూడాల‌ని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న క‌ల్కి చిత్రం పైనా భారీ అంచ‌నాలేర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News