15కిలోలు పెరిగిన పారీ త‌గ్గేందుకు పాట్లు!

వీట‌న్నిటినీ పాటించ‌డ‌మే గాక, తాను ఎంపిక చేసుకున్న పాత్ర కోసం ఏకంగా 15 కేజీలు పెరిగింది ప‌రిణీతి చోప్రా.

Update: 2023-12-06 04:12 GMT

ఎంపిక చేసుకున్న పాత్ర కోసం బ‌రువు త‌గ్గాల‌నుకుంటే తగ్గిపోవ‌డం, పెర‌గాల‌నుకుంటే పెరిగిపోవ‌డం అంత సులువేమీ కాదు. దానికోసం చాలా శ్రమించాలి. క‌ఠిన ఆహార నియ‌మాలు పాటించాలి. ముఖ్యంగా స‌మ‌య‌పాల‌న చాలా అవ‌స‌రం. వీట‌న్నిటినీ పాటించ‌డ‌మే గాక, తాను ఎంపిక చేసుకున్న పాత్ర కోసం ఏకంగా 15 కేజీలు పెరిగింది ప‌రిణీతి చోప్రా. దీని గురించి తానే స్వ‌యంగా వెల్ల‌డించింది. 'చమ్కిలా' బయోపిక్ కోసం తాను 15 కిలోల బరువు పెరిగానని పరిణీతి చోప్రా తెలిపింది. ఇది చాలా కష్టమైన ప్ర‌క్రియ అని కూడా అంది. పరిణీతి చోప్రా తదుపరి దిల్జిత్ దోసాంజ్ సరసన చమ్కిలా చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో దిల్జీత్ లేడీ ల‌వ్ అమర్‌జోత్ కౌర్‌గా కనిపించనుంది.

తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో పరిణీతి త‌న పాత్ర కోసం 15 కిలోలు పెరగాల్సి ఉందని తెలిపింది. ఇటీవ‌ల "మళ్లీ నాలా కనిపించడానికి" జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. జిమ్‌లో విస్తృతంగా వర్కౌట్ చేస్తున్నట్టు వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. వీడియోలో ఓ చోట‌ రికార్డింగ్ స్టూడియోలో కూడా పాడుతూ కనిపించింది. ఏ.ఆర్.రెహ‌మాన్ స్టూడియోలో పాట‌లు పాడ‌టం ద్వారా కూడా తాను బ‌రువు త‌గ్గాన‌ని ఛ‌మ‌త్క‌రించింది.

పారీ రాసిన లాంగ్ నోట్ లో ఇలా ఉంది. "నేను గత సంవత్సరం రెహమాన్ సర్ స్టూడియోలో పాడుతూ 6 నెలలు గడిపాను. చమ్కిలా కోసం 15 కిలోలు పెరిగేందుకు ఎక్కువ జంక్ తినడానికి ఇంటికి తిరిగి వెళ్ళాను! చ‌మ్కీలా త్వరలో Netflixలో వస్తుంది. సంగీతం..ఆహారం. అది నా దినచర్య" అని తెలిపింది.

పరిణీతి ఇటీవ‌ల‌ తాను రెహ‌మాన్ స్టూడియోను కోల్పోతున్నానని, తిరిగి తన సాధారణ స్థితికి రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నానని రాసింది. "సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తయింది. ఆ త‌ర్వాత నా క‌థ మారింది. స్టూడియో అందుబాటులో లేదు. జిమ్‌లో పని చేస్తున్నాను. మళ్లీ నాలా కనిపించాలని ప్రయత్నిస్తున్నాను. అమర్‌జోత్ జీ లాగా కాదు! ఇది చాలా కష్టమైంది. అయితే నా పాత్ర‌ కోసం ఇంతియాజ్ సార్ ఇంకేదైనా చేస్తారేమో.. ఇంకా కొన‌సాగిస్తారేమో చూడాలి" అని ఛ‌మత్క‌రించింది.

చమ్కిలా ఫస్ట్ లుక్

చమ్కిలా నుండి దిల్జిత్ దోసాంజ్ ఫస్ట్ లుక్ ఈ ఏడాది మేలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ టీజర్‌ను క్యాప్షన్‌తో షేర్ చేసింది. "జో నామ్ సలోన్ సే ఆప్కే దిల్ ఔర్ దిమాగ్ పే ఛాయా హై వో అబ్ ఆప్కే సామ్నే ఆయా హై" (మీ హృదయాలను మనస్సులను పాలించే పేరు మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది). పంజాబ్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన కళాకారుడు అమర్ సింగ్ #చమ్కిలా అన్‌టోల్డ్ స్టోరీని త్వరలో Netflixలో మాత్రమే చూడండి!" అని రాసారు.

పరిణీతి చివరిగా టిను సురేష్ దేశాయ్ తెర‌కెక్కించిన‌ సర్వైవల్ డ్రామా 'మిషన్ రాణిగంజ్‌'లో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. పారీ ఇటీవల తన ప్రియుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది. సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో జరిగిన అంగరంగ వైభవమైన పెళ్లితో వీరిద్దరు ఒక్కటయ్యారు. పెళ్లి త‌ర్వాతా తిరిగి ప‌రిణీతి త‌న న‌ట‌నా కెరీర్ ని కొన‌సాగించ‌నుంది.

Tags:    

Similar News