నీల్ మామ.. మళ్ళీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ సినిమా.. అంచనాలను అందుకుని ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది

Update: 2024-04-27 12:05 GMT

బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి-2 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కు తగ్గ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సలార్ సినిమాతో భారీ హిట్ అందించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గత ఏడాది డిసెంబర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ మూవీ.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ సినిమా.. అంచనాలను అందుకుని ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. ఇక సలార్-2 కూడా ఉందని ముందే ప్రకటించారు. సలార్ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కు ఇచ్చిన ఎలివేషన్స్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ టైటిల్ ను శౌరాంగ్య పర్వంగా ఖరారు కూడా చేశారు. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి.

అయితే ఇంతలోనే ప్రశాంత్ నీల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సలార్-2కు టెంపరరీ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శౌరాంగ్య పర్వం మూవీని పోస్ట్ పోన్ చేసి మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెట్టాలని నీల్ డిసైడ్ అయ్యారట. త్వరలో 'ఎన్టీఆర్ 31' మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే తారక్- నీల్ మూవీ ఫిక్స్ అయింది. కొన్ని నెలల క్రితం ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. 2024 మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుందని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా దేవరతో పాటు వార్-2 షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన షెడ్యూల్ లో పాల్గొని తిరిగి వచ్చారు.

ఇక దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల గోవాలో ఓ సాంగ్ ను కూడా షూట్ చేశారు. మరి ప్రశాంత్ సలార్- 2నే కంటిన్యూ చేస్తారా? లేదా ఆ ప్రాజెక్ట్ ను పోస్ట్పోన్ చేసి 'ఎన్టీఆర్ 31'ను పట్టాలెక్కిస్తారా? అనేది చూడాలి.

Tags:    

Similar News