సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ ని బయటపెట్టిన అమ్మడు !
ఐతే ఇండియన్ 2 రిజల్ట్ నిరాశపరచడంతో తనపై విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కుంది.
కోలీవుడ్ లో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తెలుగు ఆడియన్స్ కు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతుంది. సంతోష్ శోభన్ చేసిన కళ్యాణం కమనీయం సినిమాలో నటించిన ఆమె నాగ చైతన్య ధూత వెబ్ సీరీస్ లో కూడా మెప్పించింది. తెలుగులో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది అమ్మడు. ఇక ఈమధ్యనే కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 సినిమాలో భాగమైంది ప్రియా భవాని శంకర్. సినిమాలో సిద్ధార్థ్ ఫ్రెండ్ రోల్ లో నటించింది ప్రియా భవాని శంకర్.
ఐతే ఇండియన్ 2 రిజల్ట్ నిరాశపరచడంతో తనపై విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కుంది. తన మీద అభిమానం చూపించే వారికి మాత్రమే తాను క్షమాపణ కోరుతానని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది ప్రియ. అంతేకాదు సినీ పరిశ్రమకు రాకముందు నుంచే తనకు రాజు అనే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని. మా మధ్య ఇప్పటికీ రిలేషన్ కొనసాగుతుందని అన్నారు. పెళ్లి గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ అది ఎప్పుడు డిసైడ్ అయినా అందరికీ చెబుతానని అంటుంది అమ్మడు.
సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మధ్య స్నేహం ఉంటుంది. ఆ టైం లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నటులకు విష్ చేస్తే వారితో రిలేషన్ ఉన్నట్టు కాదని అదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రియా భవాని శంకర్. ఛాన్స్ ఇస్తే ఇంకా ఎంతమందితో తనని లింక్ కడతారు అనుకుంది కాబోలు అమ్మడు తన సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ పేరుని బయట పెట్టింది. ఐతే తనతో ఎంతమందికి జత కడుతూ వార్తలు రాసినా తన బోయ్ ఫ్రెండ్ తనని బాగా అర్థం చేసుకున్నాడని చెప్పింది ప్రియా భవాని శంకర్.
మంచు మనోజ్ సినిమలో కూడా ప్రియా భవాని శంకర్ నటించాల్సి ఉంది. కానీ అది ఆగిపోవడంతో అమ్మడు కళ్యాణం కమనీయంతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి అమ్మాయిగా కనిపిస్తే ప్రియా భవాని హీరోయిన్ పాత్రలే చేయాలి అన్నట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్స్ వచ్చినా సరే చేస్తూ వచ్చింది. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ప్రియా భవాని శంకర్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఐతే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటానని షాక్ ఇచ్చింది అమ్మడు. ప్రియా భవాని శంకర్ ప్రస్తుతం డిమాంటీ కాలనీ 2, జీబ్రా సినిమాల్లో నటిస్తుంది అందాల భామ.