లండన్‌లో పీసీ వర్సెస్ సమంత
ప్రిన్సెస్ డయానా (ఇటలీ) చిత్రాల ప్రత్యేక ప్రదర్శనకు గ్లోబల్ స్టార్, సిటాడెల్ ఫేం ప్రియాంక చోప్రా హాజరయ్యారు.
ప్రిన్సెస్ డయానా (ఇటలీ) చిత్రాల ప్రత్యేక ప్రదర్శనకు గ్లోబల్ స్టార్, సిటాడెల్ ఫేం ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంతా రూత్ ప్రభు ప్రత్యక్షమవ్వడం పీసీ, మటిల్డా డి ఏంజెలిస్ వంటి ప్రముఖులతో కలిసి సరదాగా గడపడం హాట్ టాపిక్ గా మారింది. వారితో కలిసి ఉన్న వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతున్నాయి. ప్రియాంక సిటాడెల్ సీజన్ వన్‌లో నటించగా, సమంత -వరుణ్ ధావన్ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించనున్నారు.
ప్రియాంక, సమంత, మటిల్డా ఈవెంట్లో గ్రూప్ గా ఫోటోలకు పోజులిచ్చారు. వారు నవ్వుకుంటూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకున్నారు. స్పై యాక్షన్ సిరీస్‌లోని ఇతర టీమ్ సభ్యులతో పాటు రాజ్ అండ్ DK కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రియాంక బ్రైట్ రెడ్ బాడీకాన్ డ్రెస్ ధరించగా, సమంత నేవీ బ్లూ దుస్తులను ఎంచుకుంది. మటిల్డా బంగారు వర్ణం దుస్తులలో కనిపించింది.
ఇటీవల ప్రియాంక తన ప్రైమ్ వీడియో సిరీస్ సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ప్రారంభించింది. ప్రియాంకతో పాటు, రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుక్సీ , లెస్లీ మాన్విల్లే కూడా సీజన్ 2 షో కోసం తిరిగి పని చేయనున్నారు. జో రస్సో దర్శకత్వం వహిస్తారు. సిటాడెల్ సీజన్ టూను డేవిడ్ వెల్ రాశారు. సిటాడెల్ సీజన్ 1 ప్రకారం.. ఎలైట్ ఏజెంట్లు మాసన్ కేన్ (రిచర్డ్) నదియా సిన్హ్ (ప్రియాంక) జీవితాల్లో ఏం జరిగింది? అన్నది తెరపై కనిపించింది. స్వతంత్ర ప్రపంచ గూఢచారి సంస్థ సిటాడెల్ పతనం తర్వాత వారు తమ ప్రాణాలతో తృటిలో తప్పించుకున్నా కానీ, వారి జ్ఞాపకాలను మర్చిపోతారు. సిటాడెల్‌ను AGBO కోసం ఆంథోనీ రస్సో, జో రస్సో, ఏంజెలా రస్సో-ఓట్‌స్టాట్ , స్కాట్ నీమ్స్ నిర్మించారు.
సిటాడెల్ గురించి..
సిటాడెల్‌లో భారీ తారాగణం నటించారు. ఆర్నాల్డో కాటినారి దర్శకత్వం వహించారు. ఆరు ఎపిసోడ్‌ల సిరీస్ 10 అక్టోబర్ 2024న ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తారు. `సిటాడెల్: హనీ బన్నీ` ఈ ఏడాది నవంబర్ 7న ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. దీనికి రాజ్ & డికె దర్శకత్వం వహించారు.