నిర్మాతపై చీటింగ్ కేసు.. రూ.16 కోట్లు టోకరా!
ఆ విషయం పక్కన పెడితే తాజాగా నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి చీటింగ్ కేసులో నిర్మాత అరెస్ట్ అవ్వడం జరిగింది.
కొన్ని రోజుల క్రితం సీరియల్ నటి మహాలక్ష్మి నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ వివాహ వార్తలు వైరల్ అయ్యాయి. మహాలక్ష్మి అతడిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ చాలా మంది బాహాటంగానే విమర్శలు చేశారు. డబ్బు కోసం ఆయన్ను పెళ్లి చేసుకుని ఉంటుందని కూడా కొందరు కామెంట్స్ చేశారు.
ఆ విషయం పక్కన పెడితే తాజాగా నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి చీటింగ్ కేసులో నిర్మాత అరెస్ట్ అవ్వడం జరిగింది. ఓ వ్యక్తి తాను రూ.16 కోట్ల మేరకు మోస పోయాను అని, తనను చీట్ చేశాడు అంటూ ఆయన ఫిర్యాదు చేశాడు. రూ.16 కోట్లు మోసం చేశాడు అంటూ రవీంద్రన్ పై సదరు వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యం లో విషయం వైరల్ అయింది.
మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను ఇంధనంగా మార్చే రూ.200 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లో రవీంద్రన్ తనను సంప్రదించాడు అంటూ ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ప్రాజెక్ట్ లో తాను రూ.16 కోట్లు పెట్టాను అన్నాడు. ప్రాజెక్ట్ ప్రారంభం ఇన్నాళ్లు అయినా చేపట్టక పోవడంతో తాను మోసపోయినట్లుగా గ్రహించాను అంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.
పోలీసులు ప్రస్తుతం ఈ కేసును ఎంక్వౌరీ చేస్తున్నారు. రవీంద్రన్ ప్రాజెక్ట్ పేరుతో మోసం చేసినట్లుగా వెళ్లడి అయిందంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ఇప్పటికే రవీంద్రన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.