పవన్ పై నిర్మాతలంతా ఒత్తిడి తెస్తున్నారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిర్మాతలంతా ఒత్తిడి తెస్తున్నారా? సన్నివేశం చూస్తుంటే అలాగే కనిపిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నిర్మాతలంతా ఒత్తిడి తెస్తున్నారా? సన్నివేశం చూస్తుంటే అలాగే కనిపిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే `హరి హర వీరమల్లు` టీమ్ పవన్ కళ్యాణ్ కలిసింది. అటుపై `ఉస్తాద్ భగత్ సింగ్` దర్శకుడు హరీష్ శంకర్ అండ్ కో కూడా పవన్ తో సమావేశమైంది. తాజాగా `ఓజీ` చిత్ర దర్శకు డు సుజీత్..నిర్మాత దానయ్య కూడా పవన్ కళ్యాణ్ ని కలిసారు. ఈ మూడు సమావేశాల యోక్క సారాంశం ఒక్కటే. తమ సినిమా షూటింగ్ లను వీలైనంత వేగంగా పూర్తి చేయమని పవన్ కి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో పవన్ కి తమ సమస్యల్ని చెప్పుకున్నట్లు కనిపిస్తుంది. పవన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్ పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారు. పొలిటికల్ గా ఇప్పుడంతా సెట్ అయిన నేపథ్యంలో పవన్ ఆర్డర్ ప్రకారం డేట్లు కేటాయించే అవకాశం ఉంది. మునుపటిలా కాకుండా పవన్ కూడా ఇప్పుడు ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ లకు హాజరవ్వడం కూడా అలవాటు చేసుకున్నారు. కాబట్టి నిర్మాతలకు ఆ రకమైన టెన్షన్ అవసరం లేదు.
ఆలస్యమైనా అందరి పని పూర్తి చేస్తారు. కానీ నిర్మాతలంతా ఒకేసారి ఒకరి తర్వాత ఒకరి వెళ్లడమే పవన్ ని కాస్త ఇబ్బంది పెట్టినట్లుగా అనిపిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది. ఒకరి తర్వాత ఒకరు కలవడంతో ముందుగా పవన్ ఎక్కడా తమకే డేట్లు ఇచ్చేస్తారు? అన్న భావనలో నిర్మాతలంతా ఇలా త్వరపడుతున్నారా? అన్న సందేహం తెరపైకి వస్తుంది. పవన్ ఇంకా అధికారికంగా ఏ సినిమాకి డేట్లు ఇవ్వలేదు.
అక్టోబర్ నుంచి ఓజీ సెట్స్ కి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో వాస్తవం లేదు. మిగతా సినిమాల విషయంలోనూ అలాంటి జాప్యమే కనిపిస్తోంది. అలాగే దానయ్య నిర్మిస్తోన్న మరో సినిమా `సరిపోదా శనివారం` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా పవన్ ని ఆహ్వానించారా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి పవన్ బిజీ షెడ్యూల్ లో అది సాధ్యపడుతుందా? లేదా? అన్నది చూడాలి.