పుష్ప 2 డిజిటల్ రైట్స్.. నెవ్వర్ బిఫోర్ డీల్

కచ్చితంగా పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Update: 2024-09-02 06:10 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. పుష్పకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సినిమా రిలీజ్ ఆలస్యం అయిన కూడా మూవీపైన హైప్ మాత్రం అస్సలు తగ్గలేదు. కచ్చితంగా పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సుకుమార్ ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరో వైపు పుష్ప ది రూల్ బిజినెస్ డీల్స్ పైన చర్చలు జరుగుతున్నాయంట. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ రికార్డ్ ధరకి సేల్ అయ్యాయంట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప ది రూల్ డిజిటల్ రైట్స్ తో ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసిందని తెలుస్తోంది.

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ పుష్ప ది రూల్ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా 270 కోట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇచ్చిందంట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా డిజిటల్ రైట్స్ ఈ ధరకి అమ్ముడుపోలేదు. పుష్ప ది రూల్ సినిమాకి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉందని నెట్ ఫ్లిక్స్ భావిస్తోందంట. అందుకే భారీ ధర చెల్లించి రైట్స్ ని సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో 80 శాతం డిజిటల్ రైట్స్ ద్వారానే మైత్రీ మూవీ మేకర్స్ రికవరీ చేసినట్లు సమాచారం. మూవీ ఆడియో రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. 400 కోట్ల వరకు ఈ సినిమాపై థీయాట్రికల్ బిజినెస్ జరుగుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అంటే ఏ విధంగా చూసుకున్న వరల్డ్ వైడ్ గా 600+ కోట్లకి పైగా ప్రీరిలీజ్ బిజినెస్ లెక్క పుష్ప ది రూల్ పైన కనిపిస్తోంది.

రాబోయే నాలుగు నెలల్లో ఈ సినిమా సాంగ్స్, కంటెంట్ తో వీలైనంత హైప్ మూవీపైన క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్ ని జనాల్లోకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు. అదే జరిగితే ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో ఆర్ఆర్ఆర్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. మరి పుష్ప ది రూల్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ ప్లానింగ్ ఎలా ఉందో వేచి చూడాలి.

Tags:    

Similar News