పుష్ప 2 ట్రైలర్… కిడ్స్ వెర్షన్… ఓ లుక్కేయండి

ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప 2’ ట్రైలర్ ని కొంతమంది కిడ్స్ తో రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.

Update: 2024-12-01 10:13 GMT

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ‘పుష్ప 2’ మానియా గట్టిగానే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ హంగామానే కనిపిస్తోంది. ఓ వైపు పుష్ప సాంగ్స్ సందడి షార్ట్స్ లో నడుస్తోంది. మరో వైపు మూవీలోని పుష్పరాజ్ క్యారెక్టర్ ని ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పబ్లిక్ లో ‘పుష్ప 2’ బజ్ నడుస్తోంది. మేకర్స్ కూడా ఈ సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు.

ఫ్యాన్స్ చేసే వీడియోలని కూడా షేర్ చేస్తూ మూవీకి పబ్లిక్ లో ఎలాంటి క్రేజ్ ఉందనేది చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప 2’ ట్రైలర్ ని కొంతమంది కిడ్స్ తో రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. మేకర్స్ కూడా ఈ వీడియో చేసిన టీమ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అద్భుతంగా ఉందని అభినందిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో చాలా మంది ఔత్సాహికులు ఇలా సినిమాలలోని సాంగ్స్, ఫైట్స్ తో పాటు ఇలాంటి ట్రైలర్స్ ని కూడా రీక్రియేట్ చేస్తూ తమలోని మేకింగ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ ని చూపించుకుంటున్నారు. కిడ్స్ తో చేసిన ఈ ‘పుష్ప 2’ ట్రైలర్ లో కూడా పుష్పరాజ్ గా చేసిన పిల్లాడు బాగా నటించాడనే మాట వినిపిస్తోంది అలాగే సుకుమార్ తెరకెక్కిన ఒరిజినల్ ట్రైలర్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ కిడ్స్ వెర్షన్ ఉందనే మాట వినిపిస్తోంది.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సంతోష్ ముత్యాల అనే కుర్రాడు ఈ కిడ్స్ వెర్షన్ ‘పుష్ప 2’ ట్రైలర్ ని డిజైన్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అంతకంటే ఒక రోజు ముందుగా యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మూవీ ప్రీమియర్స్ పడబోతున్నాయని తెలుస్తోంది.

ఇండియాలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్స్ బుక్ చేస్తున్నారు. గత ఏడాది యానిమల్ తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న రష్మిక మందన ఈ ఏడాది ‘పుష్ప 2’తో మరో సూపర్ హిట్ అందుకోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. అలాగే శ్రీలీల చేసిన ఐటెం సాంగ్ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.

Full View
Tags:    

Similar News