పుష్ప 2: ముంబైలో మొదటి జాతర

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప 2: ది రూల్" పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-10-15 07:42 GMT

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప 2: ది రూల్" పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రను మళ్లీ తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న క్యారెక్టర్ కూడా ఈసారి మరింత కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో, ఈ సీక్వెల్ పై భారీ హైప్ నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదల తేదీని ముందుకు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే డిసెంబర్ 6, విడుదల కావాల్సిన ఈ చిత్రం, డిసెంబర్ 5, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక మొదటి పుష్ప రాజ్ జాతర ముంబైలోనే మొదలవ్వనున్నట్లు తెలుస్తుంది. ముంబయిలో డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు మొదటి ప్రీమియర్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిసెంబర్ 5 ఉదయం 1 గంట నుంచి ప్రీమియర్ షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ విషయంలో అధికారికంగా చిత్రబృందం నుండి ధృవీకరణ రానుంది. ఫహాద్ ఫాసిల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా మరోసారి పుష్పకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్, బ్రహ్మాజీ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కీలకపాత్ర పోషించనుంది. "పుష్పా: ది రూల్" కథ పుష్పా రాజ్ జీవితంలో వచ్చే మరో కీలక మలుపు చుట్టూ తిరుగుతుందని సమాచారం. కథలో న్యాయం, ప్రతీకారం, మరియు పుష్పా రాజ్ పై నడిచే ముఠా రాజకీయాలు ప్రధానాంశాలుగా ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి.

ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, పాటలు, మరియు కథన శైలి ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేయనున్నాయని టాక్. అల్లు అర్జున్ గతంలో "పుష్పా 1: ది రైస్" ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సీక్వెల్ విజయవంతమైతే, ఆయన కెరీర్‌లో మరొక రికార్డ్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల కానుంది. ప్రీమియర్ షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్లు తదితరాల ద్వారా "పుష్పా 2" మీద మరింత హైప్ పెంచడానికి మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి, సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News