సింగిల్ స్క్రీన్స్‌లోనే పుష్ప జాతర...!
పుష్ప 2 సినిమా ముందు ముందు భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 12 వేల థియేటర్‌లలో విడుదలైన పుష్ప 2 సినిమా అనుకున్నట్లుగానే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మొదటి రెండు రోజుల్లో రూ.449 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు మొదటి ఆటతోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి పోయింది. ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత ఫాస్ట్‌గా రూ.500 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప 2 నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి, నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2 సినిమా ముందు ముందు భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
పుష్ప 2 సినిమా సింగిల్ స్క్రీన్స్‌లో ఎక్కువగా వసూళ్లు రాబడుతోంది. సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాలు మల్టీప్లెక్స్‌ల్లో వసూళ్లు రాబట్టడం మనం చూస్తూ ఉన్నాం. కానీ పుష్ప 2 సినిమాకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ వద్ద ఉన్న జాతర మల్టీప్లెక్స్‌ల వద్ద కనిపించడం లేదు. నార్త్‌లోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో ఎక్కువ చూస్తున్నారు. నార్త్‌లో పుష్ప 1 సైతం సింగిల్ స్క్రీన్‌లోనే ఎక్కువ చూశారు. కానీ సౌత్‌లో అది తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ నుంచి ఎక్కువ వసూళ్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌ల వద్ద జన జాతర కనిపించక పోవడంకు ప్రధాన కారణం టికెట్ల రేట్లు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సింగిల్ స్క్రీన్స్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌ల్లో ఎక్కువ టికెట్ల రేట్లు ఉన్నాయి. దాంతో సినిమా చూడాలి అనుకున్న వారు మల్టీప్లెక్స్‌లకు వెళ్లకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకు వెళ్తున్నారు. ఆ కారణంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి వసూళ్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. మల్టీప్లెక్స్ నుంచి సోమవారం నుంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నిర్మాతలు ఇప్పటికే సోమవారం నుంచి టికెట్ల రేట్లను తగ్గించేందుకు ఓకే చెప్పారు. టికెట్ల రేట్లను తగ్గించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో మల్టీప్లెక్స్‌ల వద్ద సోమవారం నుంచి జనాలు భారీ మొత్తంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే నార్త్‌లో అత్యధికంగా వసూళ్లు నమోదు కావడంను చూస్తే ప్రేక్షకులపై టికెట్ల రేట్లు ఎంతగా ప్రభావంను చూపించాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే టికెట్ల రేట్లు అధికంగా ఉన్నట్లుగా భావిస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు మరింతగా పెంచడంతో సినిమా లేకున్నా పర్వాలేదు అంటూ మల్టీప్లెక్స్‌కి వెళ్లే వారు అటు చూడటం లేదు.