పుష్ప-2.. ఇంకా ఎన్ని రోజులు?
పుష్ప కన్నా పుష్ప-2ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అటు సినీ అభిమానులతోపాటు ఇటు బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క గ్లింప్స్ తో సినిమాపై ఓ రేంజ్ లో మూవీ టీమ్ అందరి అంచనాలు పెంచేసింది. కచ్చితంగా మూవీ చూడాల్సిందేనన్న హైప్ క్రియేట్ చేసింది. తగ్గేదేలే అంటూ షూటింగ్ ను శరవేగంగా జరుపుతోంది.
పుష్ప కన్నా పుష్ప-2ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొన్ని సీన్లు రీషూట్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆడియన్స్ కు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ నిర్వహిస్తున్నారు. కచ్చితంగా అనుకున్న తేదీకే అంటే ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది కంప్లీట్ మూవీ టీమ్.
అయితే పుష్ప-2 రిలీజ్ కు ఇంకా 150 రోజులే ఉంది. మరికొద్ది రోజుల్లో పుష్ప షూటింగ్ పూర్తవ్వనుందట. వెంటనే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించనున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయట. సుకుమార్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారట. దీంతో ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజవ్వడం పక్కా అని చెప్పవచ్చు.
ఇక త్వరలోనే అంటే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. గతేడాది బర్త్ డేకు టీజర్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు సాంగ్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట. అయితే పుష్ప-1 మ్యూజిక్ ఎలాంటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సీక్వెల్ మ్యూజిక్ పై మూవీ లవర్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు ఈ సినిమాపై బాహుబలి-2 రేంజ్ కన్నా ఎక్కువ హైప్ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోతే పుష్ప-2.. బాహుబలి-2 తోపాటు అనేక రికార్డులు బద్దలుకొట్టనుంది. అయితే ఆగస్టు 15న పలు చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కమల్ హాసన్ ఇండియన్-2, దళపతి విజయ్ గోట్ తోపాటు బాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్ సింగం-3 విడుదలవ్వనున్నట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.