33 ఏళ్లు... ఇంకా ఆ ఒక్కటి అడగొద్దట
33 ఏళ్ల రాశి ఖన్నా మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా సినిమాలు చేయాలని ఆశ పడుతుందట.
ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా దక్కని గుర్తింపు ఊహలు గుసగుసలాడే సినిమాతో దక్కిన విషయం తెల్సిందే. రాశి ఖన్నా టాలీవుడ్ లో పలువురు యంగ్ స్టార్ హీరోలతో నటించి సక్సెస్ లను దక్కించుకుంది.
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రాశి ఖన్నా జోరు కాస్త తగ్గింది. అయితే లక్కీగా ఈ అమ్మడికి తమిళ మరియు హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. మళ్లీ టాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని ఈ అమ్మడు ఆశ పడుతుందట.
33 ఏళ్ల రాశి ఖన్నా మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా సినిమాలు చేయాలని ఆశ పడుతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదు అంటూ గతంలోనే క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన గత సినిమాలు రాబోయే సినిమాలు ఇతర విషయాల గురించి మాట్లాడింది. అదే ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించిన సమయంలో మాత్రం ఆ ఒక్క విషయం అడగవద్దు అంటూ ప్రశ్న ని స్కిప్ చేసి మరో ప్రశ్నకు వెళ్లి పోవాలి అంటూ సున్నితంగా చెప్పింది.
సాధారణంగా హీరోయిన్స్ ఆఫర్లు తగ్గుముఖం పట్టిన తర్వాత పెళ్లి వైపు ఆసక్తి చూపిస్తారు. బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తారు. కానీ సౌత్ లో మాత్రం పెళ్లి తర్వాత ఆఫర్లు దక్కడం చాలా కష్టం. అందుకే సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేసి చివరకు పెళ్లి కి సిద్ధం అవుతారు. మరి రాశి ఖన్నా కూడా అదే సిద్ధాంతం తో ముందుకు వెళ్తుందేమో చూడాలి.