100 కోట్లు కొడుతున్నా ఆ హీరోకి నిరాశేనా?

కానీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది.

Update: 2024-08-01 16:40 GMT

చేతి నిండా సినిమాలతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే హీరో ధనుష్. గడిచిన ఏడాది కాలంలో బ్యాక్ టూ బ్యాక్ మూడుసార్లు 100 కోట్ల క్లబ్ లో చేరాడీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' చిత్రం, గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఆరు రోజుల్లోనే ₹100 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది.

'రాయన్' సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. అలా అని నెగెటివ్ టాక్ కూడా రాలేదు. రివ్యూలు కూడా అలానే వచ్చాయి. రొటీన్ స్టోరీ అయినప్పటికీ.. ప్రధాన నటీనటుల పెర్ఫార్మన్స్, ఎమోషన్స్, యాక్షన్, బీజీఎమ్ కోసం చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సందీప్ కిషన్ సపోర్ట్ కూడా యాడ్ అవ్వడంతో, తెలుగులోనూ డీసెంట్ వసూళ్లు నమోదయ్యాయి. కానీ వీక్ డేస్ లోనే ఈ సినిమా జోరు కాస్త తగ్గినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రాయన్ మూవీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ ఏడాదిలో రిలీజైన 'ఇండియన్ 2' 'మహారాజా' చిత్రాల తమిళనాడు కలెక్షన్లను క్రాస్ చేసింది. ఓవర్సీస్‌లో ధనుష్‌కి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలవడమే కాదు.. సూర్య, శివ కార్తికేయన్, శింబు లాంటి హీరోల కెరీర్‌ బెస్ట్ నంబర్స్ ను అధిగమించింది. కానీ ఎందుకనో తెలుగు మార్కెట్‌ పై ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్నాటకలోనూ వసూళ్లు డ్రాప్ అయ్యాయని తెలుస్తోంది.

'రఘువరన్ బిటెక్' లాంటి డబ్బింగ్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు ధనుష్. 'సార్' మూవీతో నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు. దీంతో తమిళ హీరోకి ఇక్కడ తిరుగు లేదని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' మూవీ తమిళ్ లో వంద కోట్ల గ్రాస్ వసూలు చేసినా, తెలుగులో మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రాయన్' సినిమా సైతం వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినా, మన దగ్గర మాత్రం ఆశించిన రేంజ్ లో వసూలు చేయడం లేదనే మాట వినిపిస్తోంది. కాకపోతే ఈ వారం కూడా పెద్ద సినిమాల రిలీజులు లేకపోవడం ధనుష్ కు కలిసొచ్చే అంశం. కాబట్టి లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం కాకపోవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుద్దో చూడాలి.

ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున పవర్ ఫుల్ క్యారక్టర్ ప్లే చేస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News