ప్లాస్టిక్ సర్జరీ విషయంలో ఆ భామ వార్నింగ్?
తాజాగా నటి రాధికా మదన్ ఇలాంటి సర్జరీలు తప్పేంకాదంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది
గ్లామర్ వరల్డ్ లో పోటీని తట్టుకోవాలంటే బ్యూటీ కూడా అంతే అవసరం. అందంగా కనిపించడానికి హీరోయిన్లు అంతా రకరకరాల సర్జరీలకు వెళ్తుంటారు. కొవ్వు తీయించుకోవడం కోసం లైపో సర్జరీ...ముక్కు, మూతి కోసం ప్లాస్టిక్ సర్జరీలకు వెళ్లడం పరిపాటే. అయితే ఈ సర్జరీలు వికటించి ప్రాణం మీదకు తెచ్చుకు న్నవారు, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయినా సర్జరీలు విషయంలో హీరోయిన్లు ఏమాత్రం వెనుకడుగు వేయరు.
తాజాగా నటి రాధికా మదన్ ఇలాంటి సర్జరీలు తప్పేంకాదంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్న వారిని నేను తప్పుబట్టను. ఆ సర్జరీ వల్ల అందం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగని ప్రతీ సారి ఆ రకమైన సర్జరీలు జోలికి వెళ్లకూడదు. సర్జరీలు ది బెస్ట్ అని కచ్చితంగా చెప్పను. అలాగని చెడ్డవి కాదు.అవసరం మేర సర్జరీలకు వెళ్లొచ్చు. భవిష్యత్ లో నేను కూడా సర్జరీకి వెళ్లొచ్చు.
కానీ సర్జరీ కి వెళ్లేముందు అన్నిరకాలుగా తెలుసుకుని వెళ్లాలి. బ్యూటీ కోసం అనే ఆత్రంలో పడి కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలేస్తాం. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నది కూడా ఓ అంచనా వేసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్య వంతులకు ఇబ్బంది ఉండదు. అలా కానీ వారు అన్ని రకాల జాగ్రత్తలతో ముందుకెళ్లాలి` అని తెలిపింది.
రాధికా మదన్ ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా `సర్పిరా` లో నటించిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయింది. కానీ వాటిని అందు కోవడంలో విఫలమైంది. దీంతో అక్షయ్ ఖాతాలో మరో ప్లాప్ నమోదైంది.