సెట్స్ లో వాష్ రూమ్ కి వెళ్లడానికి ఇబ్బందే!
ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు ఇండస్ట్రీలో తనకెదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
శాండల్‌వుడ్ లో గ్లామరస్ కథానాయికగా రాగిణి ద్వివేదికి మంచి ఫాలోయింగ్ ఉంది. పరిశ్రమ అగ్ర హీరోల సరసన నటించిన బ్యూటీ కెరీర్ రెండేళ్ల క్రితం వరకూ ఒక రేంజులో సాగింది. కానీ అనూహ్యంగా డ్రగ్స్ స్కాండల్‌లో జైలుకు వెళ్లడం వగైరా అంశాలతో రాగిణి ఖ్యాతి మసకబారింది. ప్రస్తుతం బెయిల్ బయట ఉంది. తదుపరి నటిగా కెరీర్ ని పట్టాలెక్కించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు ఇండస్ట్రీలో తనకెదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
సాధారణంగా నటీనటనులకు సెట్స్ లో వ్యానిటీ వ్యాన్లు ఉంటాయి. అందులో రకరకాలున్నాయి. సాధరమైణ వ్యాన్లు...విలాసవంతమైనవి ఉన్నాయి. అద్బుతమైన ఇంటిని సైతం తలపించే వ్యాన్లు చాలా ఉన్నాయి. అవన్నీ నటులను బట్టి నిర్మాతలు సమకూర్చు తుంటారు. అయితే చాలా మంది నిర్మాతలు సెట్స్ లో కనీస అవసరాలు కూడా తీర్చడం లేదంది. బట్టలు మార్చుకోవడానికి, వాష్ రూమ్ కి వెళ్లడానికి కూడా సెట్స్ లో ఇబ్బంది పడాల్సి వస్తోందని అంది.
ఔట్ డోర్ షూటింగ్ అంటే ఇప్పుడంతా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ కొంత మంది నిర్మాతలు నిమ్మకు నిరెత్తనట్లు వ్యవరిస్తున్నారు. వ్యానిటీ వ్యాన్లు లేకపోతే బట్టలు కూడా బయటే మార్చుకోవాలి. చుట్టు పక్కల మగవారు ఎవరూ లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి? అందుకోసమే వ్యానిటీ వ్యాన్లు తప్పని సరి చేసారు.
కానీ వాటిని సమకూర్చే నిర్మాతలు ఎంత మంది. చిన్న చిన్న నటీమణులంతా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మాకు ఏసీలు అవసరం లేదు..చిన్నపాటి సౌకర్యాలు కల్పిస్తే చాలు` అని తెలిపింది. మరి ఈ వ్యాఖ్యలపై కన్నడ ఇండస్ట్రీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.