బికినీలో నిన్ను డామినేట్ చేసేవాళ్ళు లేరు రత్తాలు

కానీ, ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడం కారణంగా ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

Update: 2024-07-03 02:45 GMT

చిత్రపరిశ్రమలో అందం, టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో లక్ష్మీ రాయ్ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. తెలుగులో "కాంచనమాల కేబుల్ టీవీ" అనే సినిమాలో శ్రీకాంత్ సరసన నటించి సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లక్ష్మీ రాయ్, ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. కానీ, ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడం కారణంగా ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.


తరువాత, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కంచన" సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఆమె దక్షిణ భారత సినీ పరిశ్రమలో బిజీబిజీగా మెరిసిపోయింది. సౌత్ పెద్ద సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు పొందలేకపోయినా, ఐటెం సాంగ్స్ అంటూ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించింది. “రత్తాలు” అనే పాట ద్వారా ఆమెను అభిమానులు అదే పేరుతో ఆమెను పిలుస్తున్నారు.


ఇక లక్ష్మీ రాయ్ సినిమా కెరీర్‌కి వచ్చిన విపరీతమైన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్ లో కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసినా, అక్కడ కూడా ఆశించిన స్థాయి గుర్తింపు అందుకోలేకపోయింది. ఇక అమ్మడు బికినీ పోజులతో తన అందాలతో కుర్రాళ్ళ మనసులను దోచేసింది. సోషల్ మీడియాలో అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.


తాజాగా మరోసారి డిఫరెంట్ బికినీలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోతో మరింత ట్రెండింగ్ అవుతోంది. పూల్ పక్కన తీసిన ఈ ఫోటోలో, ఆమె స్టైలిష్ గాగుల్స్ తో తన అందాన్ని మరింత హైలెట్ చేయడం విశేషం. ఈ ఫోటో చూస్తే, ఆమె అభిమానుల్లో అభిమానాన్ని పెంచేందుకు మరో మెట్టు ఎక్కిందని చెప్పవచ్చు. అమ్మడి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.

Read more!

ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అలాగే లక్ష్మీ రాయ్ క్రమంగా తన సినిమాల ప్రస్థానంలో కొత్త పథాలను అన్వేషిస్తూ, ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇక నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్త తరహా కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తోంది.

Tags:    

Similar News

eac