ఆ ఇద్దరు దర్శకులకి ఎక్కడైనా తిరుగులేదు

సౌత్ ఇండియాలో అగ్ర దర్శకులు అంటే వెంటనే రాజమౌళి, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి.

Update: 2024-08-28 20:30 GMT

సౌత్ ఇండియాలో అగ్ర దర్శకులు అంటే వెంటనే రాజమౌళి, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లతో పాన్ ఇండియా లెవల్ లో తనకి తిరుగులేదని రాజమౌళి ప్రూవ్ చేసుకున్నారు. బాహుబలి 2 ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలలో రెండో స్థానంలో నిలవగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ పరంగా టాప్ 3లో ఉంది. దీనిని బట్టి రాజమౌళి స్టామినా ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు.

బాక్సాఫీస్ దగ్గర రాజమౌళికి తిరుగులేదని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. రాజమౌళి తర్వాత స్థానంలో ప్రశాంత్ నీల్ ఉంటారు. కేజీఎఫ్ చాప్టర్ తో ఇండియాలోనే టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఉన్నారు. సలార్ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే 700 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే డార్లింగ్ ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ బ్రాండ్ కి ఉన్న క్రెడిబిలిటీ కారణం అని చెప్పాలి. ఈ సినిమాలు థియేటర్స్ లో ఏ స్థాయిలో మాస్ ని అలరించాయో ఓటీటీలో కూడా అదే స్థాయిలో రికార్డ్ స్థాయిలో వ్యూవర్ షిప్ సొంతం చేసుకున్నాయి.

చాలా కాలం పాటు ఓటీటీలో ఈ సినిమాలు ట్రెండింగ్ లో నడిచాయి. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన నాలుగు సినిమాలకి అద్భుతమైన ప్రేక్షకాదరణ ఓటీటీలలో లభించింది. అలాగే ఈ సినిమాలకి సంబందించిన ఎలివేషన్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ దర్శకుల సినిమాలు బిగ్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన తర్వాత కూడా ఓటీటీలో చాలా కాలం సక్సెస్ ఫుల్ టాక్ తో ట్రెండింగ్ లో కొనసాగడం జరగలేదు.

అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం ఇటు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడమే కాకుండా ఓటీటీలో కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చాక వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, సలార్ సినిమాలకి వస్తోన్న స్థాయిలో ఆదరణ కల్కికి రావడం లేదంట.

అలాగే ఆ సినిమాలకి సంబందించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ స్థాయిలో కల్కి మూవీ ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేయలేకపోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీనిని బట్టి రాజమౌళి, ప్రశాంత్ నీల్ కి మాత్రమే ఇటు బాక్సాఫీస్, అటు ఓటీటీలో కూడా తిరుగులేని ఇమేజ్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News