SSMB29: మీమ్స్ తోనే కిక్కిచ్చే కామెడీ!

మహేశ్‌బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2025-01-25 09:40 GMT

మహేశ్‌బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏడాది కంటే ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫైనల్ గా మహేశ్ హీరోగా చేయబోయే ఈ ప్రాజెక్ట్‌ పై రాజమౌళి ఇటీవల ఓ ఆసక్తికర వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఇందులో పాస్‌పోర్ట్ పట్టుకుని, సింహం బోనులో ఉందనే సంకేతాలను అందించారు.

అయితే ఈ వీడియో తో ట్రెండ్ అవుతున్న మీమ్స్ మాత్రం సోషల్ మీడియాలో మంచి ఎంటర్‌టైన్మెంట్‌ గా కిక్కిస్తున్నాయి. రాజమౌళి సినిమాలంటే కఠినమైన డెడికేషన్ అవసరం అని అందరికీ తెలుసు. రాజమౌళి స్టైల్ లో సింహాన్ని బంధించి, మహేశ్ పాస్‌పోర్ట్‌ని తీసుకున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మహేశ్‌బాబు తరచుగా విదేశీ విహార యాత్రలకు వెళుతుంటారన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తన కొత్త సినిమా పూర్తయ్యేవరకు మహేశ్ పాస్‌పోర్ట్‌ రాజమౌళి దగ్గరే ఉంటుందని మీమ్స్ ద్వారా ఫ్యాన్స్ తమ సృజనాత్మకతను చూపిస్తున్నారు. ఈ మీమ్స్ లో “మహేశ్ విదేశాలకు వెళ్లాలంటే రాజమౌళి అనుమతి తీసుకోవాలి”, “పాస్‌పోర్ట్ కోసం మహేశ్ పడే తిప్పలు” వంటి కామెడీ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, మహేశ్ స్వయంగా రాజమౌళి పోస్ట్‌ కు రిప్లై ఇచ్చి “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ ‘పోకిరి’ డైలాగ్‌తో ఫ్యాన్స్ కు మరింత ఆనందం కలిగించారు.

అంతే కాదు, ప్రియాంక చోప్రా కూడా “ఎట్టకేలకు...” అంటూ స్పందించడం విశేషం. ఇది ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మహేశ్ తో జోడీ కట్టినట్టు అధికారికంగా తెలిపినట్లే. ఈ వార్త సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్ట్‌పై హాలీవుడ్ స్టైల్ లో గ్రాండ్ అంచనాలు ఉన్నాయి. ఇది మహేశ్ బాబును ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. బడ్జెట్ పరంగా ఇది మరింత భారీగా ఉంటుందని టాక్. ఇప్పుడు మహేశ్ పాస్‌పోర్ట్ మీమ్స్ మాత్రమే కాదు, రాజమౌళి క్రియేటివిటీ కూడా ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాను కుదిపేస్తుందని చెప్పవచ్చు. మరి రాజమౌళి మహేశ్ కాంబో ప్రేక్షకుల అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News