SSMB29: ఫైనల్ గా మహేష్ పాస్ పోర్టు లాక్కున్న జక్కన్న.. హీరోయిన్ ఫిక్స్!
పాన్ ఇండియా నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే
పాన్ ఇండియా నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబుతో నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ ఫ్యాన్ వరల్డ్ సినిమా చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు అంటూ చాలాకాలంగా అనేక రకాలు వార్తలు వస్తున్నాయి. అయితే రాజమౌళి అఫీషియల్ గా మరొక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మాత్రం చాలా సమయం తీసుకుంటూ వస్తున్నాడు.
డైరెక్ట్ గా చెప్పకపోయినా ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీ గా ఈ సినిమా ఉండబోతుంది అని ఇదివరకే రచయిత విజయేంద్రప్రసాద్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల ఫినిష్ అయితే అయ్యాయి. కానీ ఎక్కడ కూడా రాజమౌళి ఆ విషయంపైన కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు.
ఇక లేటెస్ట్ గా SSMB29 ప్రాజెక్ట్ పై రాజమౌళి చేసిన ఒక పోస్ట్ తో అఫీషియల్ గా సరైన క్లారిటీ వచ్చేసింది. హీరో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్లు మరో క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ లో.. బోనులో సింహం ఉన్న ఫొటో ముందు పాస్ పోర్ట్ పట్టుకొని కనిలించాడు. క్యాప్చర్డ్ అంటూ మహేష్ బాబు పాస్ పోర్టు లాక్కున్నట్లు హింట్ ఇచ్చినట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే మహేష్ తరచుగా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళుతూ ఉంటాడు.
ఇక ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా జక్కన్న పాస్ పోర్టు లాక్కొని లాక్ చేసుకున్నాడు అని అర్ధమవుతుంది. మరొక హైలెట్ విషయం ఏమిటంటే మహేష్ ఆ ఫొటో కింద కామెంట్ పెట్టడం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశాడు. ఒక్కసారి సినిమా చేయడానికి ఒప్పుకుంటే తిరుగుండదు అనేలా క్లారిటీ ఇచ్చినట్లు అర్ధమవుతుంది.
ఇక మరో ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా రియాక్ట్ అయ్యింది. పాపం అన్నట్టు ఏడుస్తూ నవ్వుతున్న ఎమోజీతో ఫైనల్లీ అంటూ పీసీ రియాక్ట్ అవ్వడం చూస్తుంటే జక్కన్న వారిని ఎంతకాలం ఓపిక పట్టేలా చేశాడో అర్ధమవుతుంది. ఏదేమైనా అందరూ ఊహించినట్లే రాజమౌళి సాహస యాత్రలో మహేష్ - ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక హాలీవుడ్ పై గురి పర్ఫెక్ట్ గా సెట్టయినట్లు అర్ధమవుతుంది. ఇక త్వరలో సినిమా రెగ్యులర్ పనులు మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే జక్కన్న ఆ అప్డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.