మ్యాటర్ ఏదైనా ట్రెండింగ్ లో జక్కన్న!
రాజమౌళి నుంచి సినిమా రిలీజ్ అయి రెండున్నరేళ్లు దాటింది. `ఈగ` రిలీజ్ అయిన నాటి నుంచి జక్కన్న నుంచి ఇదే విధానంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి
రాజమౌళి నుంచి సినిమా రిలీజ్ అయి రెండున్నరేళ్లు దాటింది. `ఈగ` రిలీజ్ అయిన నాటి నుంచి జక్కన్న నుంచి ఇదే విధానంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. `ఈగ`-`బాహుబలి` మధ్య మూడేళ్లు గ్యాప్ ఉంది. `బాహుబలి బిగినింగ్`-`కన్ క్లూజన్` మధ్య రెండేళ్లు గ్యాప్ ఉంది. `కన్ క్లూజన్`- `ఆర్ ఆర్ ఆర్` మధ్య ఏకంగా ఐదేళ్లు గ్యాప్ ఉంది. సాధారణంగా ఇంత గ్యాప్ వచ్చిందంటే? అలాంటి డైరెక్టర్ గురించి నెట్టింట పెద్దగా చర్చ ఉండదు.
సినిమా రిలీజ్ అయిన కొంత కాలం వరకూ ఆ ఎగ్జైట్ మెంట్ ఉంటుంది? ఆ తర్వాత నెమ్మదిగా ఆ కిక్ తగ్గుతుంది. కానీ రాజమౌళి మాత్రం నిత్యం ట్రెండింగ్ లో ఉంటారు. అందుకు కారణంగా పాన్ ఇండియాలో అతడికి ఉన్న ఇమేజ్ ఓ కారణం అయితే? నెట్టింట ఆయన నుంచి రిలీజ్ అయ్యే ఎగ్జైట్ మెంట్ అంశాలు మరికొన్ని కారణంగా కనిపిస్తుంటాయి. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయి రెండు సంవత్సరాలు అయినా? నెట్టింట సెర్చింగ్ లో జక్కన్న ఎక్కడా వెనుక బడలేదు.
ఏదో రూపంలో ఆయన సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటున్నారు. అది సినిమా అప్ డేట్ అవ్వొచ్చు...తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కావొచ్చు. తన వ్యక్తిగత విషయాలతో కావొచ్చు. కారణం ఏదైనా? ట్రెండింగ్ లో ఉండటం అన్నది ఆయనకే చెల్లింది. ఇటీవలే తన ఫ్యామిలీకీ సంబంధించిన పెళ్లీ ఈవెంట్లో జక్కన్న ఏ రేంజ్ లో స్టెప్పులేసారో తెలిసిందే. ఆ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. అంతకు ముందు భార్య రమాతో కలిసి మరో పాటకు డాన్స్ చేసారు.
ఈ రెండు వీడియోలు జనాలు చూసిన తర్వాత జక్కన్నలో ఈ కోణం కూడా ఉందా? అని అశ్చర్యపోయారు. అలాగే `ఆర్ ఆర్ ఆర్` డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఏకంగా పాన్ వరల్డ్ కే కనెక్ట్ అవుతుంది. కొన్ని థియేటర్లతో పాటు, ఓటీటీలోనూ ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది. అటుపై రాజమౌళి గురించి చర్చ మళ్లీ ప్రపం చ వ్యాప్తంగానూ ఉంటుంది. దటీజ్ రాజమౌళి.