పుష్ప 2: జక్కన్న రియాక్షన్ ఏంటీ?
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2: ది రూల్ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 800 కోట్ల గ్రాస్ మార్కును దాటడం ద్వారా ఇండియన్ సినిమాకు కొత్త రికార్డును సృష్టించింది. అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
అయితే భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పుష్ప 2ను స్పెషల్ షోలో చూశారు. హైదరాబాద్‌లో కొత్తగా పునర్నిర్మాణం చేసిన విమల్ థియేటర్‌లో సోమవారం వేసిన సెలబ్రెటీ షోకు ఆయన హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమాను చూసినట్లు తెలుస్తోంది. ఈ విషయంతో పుష్ప 2పై ఆసక్తి మరింత పెరిగింది. ఇక రాజమౌళి ఈ సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని పంచుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి ముందునుంచి కూడా ఈ సినిమాపై పాజిటివ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సుకుమార్ కు జక్కన్న క్లోజ్ ఫ్రెండ్ అని అందరికి తెలిసిందే. ఇక షూటింగ్ టైమ్ లో కూడా పలుమార్లు లొకేషన్స్ కు వెళ్లారు. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి సుకుమార్ తనకు లొకేషన్ లోనే చూపించారు అని, అది చాలా బాగా నచ్చింది అని జక్కన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.
ఇక పూర్తి స్థాయిలో సినిమా చూసిన జక్కన్న ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ కథనం వంటి అంశాలపై రాజమౌళి అభిప్రాయం అందరికి ఆసక్తిగా మారింది. పుష్ప 2 విజయం, అందులోని కథా పరమైన అంశాలపై రాజమౌళి తన దృష్టిని ఎలాంటి రీతిలో వ్యక్తం చేస్తారో చూడాలి. అలాగే ఈ సమయంలో, రాజమౌళి అభిప్రాయం పుష్ప 2 మీద మరింత పాజిటివ్ వైబ్ తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గత రికార్డులను తిరగరాస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ దూసుకెళ్తుంది. అల్లు అర్జున్ పవర్ఫుల్ నటన, సుకుమార్ మేకింగ్ విధానం జనాలకు బాగా కనెక్ట్ అయిన అంశాలు. మొదటి రోజే పాజిటివ్ టాక్ ఒక రేంజ్ లో వ్యాపించింది. దీంతో ఎక్కడ తగ్గకుండా కలెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ లో బాక్సాఫీస్ లెక్క ఇప్పటికే 300 కోట్లు దాటడం విశేషం.