బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పై రాజమౌళి కామెంట్..!
ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి.
ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ ని బాహుబలి ముందు బాహుబలి తర్వాత అంటూ రెండు భాగాలుగా చెప్పుకునే రేంజ్ లో ఆ సినిమా ఫలితాన్ని అందుకున్నారు. బాలీవుడ్ హీరోలపై మన స్టార్స్ పైచేయి సాధించడం.. నేషనల్ లెవెల్ లో తెలుగు స్టార్స్ కు క్రేజ్ రావడం ఇదంతా ఒక్క బాహుబలి వల్లే అయ్యింది. బాహుబలితో రాజమౌళి మొదలు పెట్టిన ఈ మేనియాను మిగతా దర్శకులు కొనసాగిస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ వీరు చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. అందుకే బాహుబలి 2 తో ఆగకుండా పార్ట్ 3 కూడా చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. అలాంటి వారి కోసమే బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సీరీస్ వస్తుంది. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ కు వర్క్ చేసిన గ్రాఫిక్ ఇండియా టీం అంతా బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సీరీస్ కు పనిచేశారు.
ఈ సీరీస్ ను డిస్నీ + హాట్ స్టార్ మే 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి బాహుబలి లవర్స్ కి స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. బాహుబలి సీరీస్ ను కొనసాగించాలని ఆడియన్స్ కోరారు. వారి కోసమే బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ వస్తుంది. ఈ సీరీస్ ను ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ కు పనిచేసిన గ్రాఫిక్స్ టీం పనిచేశారు. 9 ఎపిసోడ్ లతో వస్తున్న ఈ సీరీస్ అందరు చూసి ఎంజాయ్ చేయండని అన్నారు.
ఈ సీరీస్ గురించి రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా రాజమౌళి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఎందుకు తీశామన్న విషయం వెల్లడించారు. బాహుబలి సినిమాను థియేటర్ లో దాదాపు 10 కోట్ల మంది చూశారు. మిగతా అంతా టీవీ, ఓటీటీ ఫ్లాట్ ఫాం లో చూశారు. ఆడియన్స్ అంతా ఏదో ఒక మాధ్యమం ద్వారా సినిమాను చూస్తారు. అంతేకాదు కొందరు ప్రేక్షకులు కేవలం యానిమేషన్ మూవీలను ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే బాహుబలి యానిమేషన్ సీరీస్ ను రూపొందించామని అన్నారు రాజమౌళి.
జక్కన్న చెప్పినట్టుగానే బుల్లితెర మీద ఎన్నో యానిమేషన్ సీరీస్ లకు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు వారు చూసే సూపర్ హీరోల పాత్రలను ఓన్ చేసుకుంటారు. సో ఇదే క్రమంలో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సీరీస్ ను కూడా వారు ఆదరిస్తారేమో చూడాలి.