పాన్ వరల్డ్ కోసం.. కనెక్షన్లు పెంచుతున్న రాజమౌళి!
అయితే ప్రాజెక్ట్ ను పాన్ వరల్డ్ సినిమాగా తెరపైకి తీసుకురావడానికి జక్కన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
రాజమౌళి ప్రతి సినిమా కూడా ఒక దానికి మించి మరొకటి ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళుతున్నాడు. ఒకప్పుడు ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మరొక చిన్న సినిమా చేసి తనపై ఉన్న అంచనాలను కాస్త తగ్గిస్తూ వచ్చిన రాజమౌళి బాహుబలి తర్వాత మాత్రం ఆ ఫార్ములాను తీసి పక్కన పెట్టేసాడు. ఈ రోజుల్లో జనాల అంచనాలను తగ్గించడం అనేది అంత సాధారణమైన విషయం కాదని ఆయనకు అర్థం అయిపోయింది.
అంతేకాకుండా గ్రాండ్ లెవెల్ భారీ విజువల్స్ ఉండే సినిమాలు తీసే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న సైజు సినిమాలు చేయడం టైం వేస్ట్ అని విషయం ఆయనకు బాగా అర్థమైంది. ఇక బాహుబలి తర్వాత RRR సినిమాతో హాలీవుడ్ దిగజాల ప్రశంసలు పొందిన రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సిని ప్రియులను ఆకట్టుకున్నాడు.
అయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్లోనే మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రాజెక్ట్ ను పాన్ వరల్డ్ సినిమాగా తెరపైకి తీసుకురావడానికి జక్కన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు అందుకున్నటువంటి గ్రాఫిక్స్ సంస్థలతో చేతులు కలిపాడు. వారితో ఒక పర్ఫెక్ట్ డీల్ కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును కోసం కేవలం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్టే సరిపోదు ముఖ్యంగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేసే కెపాసిటీ కూడా ఉండాలి.
అందుకోసం ఆయన కొన్ని కూడా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ లతో కనెక్షన్లు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్లో బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మించిన సంస్థలతో ఇదివరకే మాట్లాడిన రాజమౌళి సినిమా నిర్మాణంలో కూడా ఒక భాగంగా చేసుకునే అవకాశం తెలుస్తోంది. అయితే బడ్జెట్లో వారికి ఎక్కువగా షేర్ ఉండకపోయిన కూడా సినిమా రిలీజ్ సమయానికి మాత్రం బడా సంస్థలు సహాయం ఉండాలని ఫిక్స్ అయ్యారు.
మహేష్ సినిమా కోసం ప్రపంచస్తాయిలో రాజమౌళి బలమైన దారులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయబోతున్న రాజమౌళి గ్రాండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచ స్థాయిలో ఎంతవరకు ఇండియన్ సినిమాను నిలబెడతాడో.