కల్కి.. రాజమౌళి క్యారెక్టర్ క్లిక్కయ్యిందా లేదా?

దర్శకదీరుడు రాజమౌళి డైరెక్టర్ అవుతాడు అని మొదట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు.

Update: 2024-06-27 07:34 GMT

దర్శకదీరుడు రాజమౌళి డైరెక్టర్ అవుతాడు అని మొదట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు. ఆ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. అయితే అతని లుక్స్ చూసి నటుడిగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని కొందరు కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చారట. ముఖ్యంగా హీరోగా చేస్తే బాగుంటుంది అని కూడా మరి కొందరు వారి ఆలోచన విధానాన్ని డైరెక్ట్ గా రాజమౌళికి చెప్పారట.

కానీ రాజమౌళి మాత్రం అటువైపు వెళ్ళకుండా టెక్నీషియన్ గానే స్థిరపడాలని అడుగులు వేశాడు. ఇక మొదట ఎడిటింగ్ నేర్చుకుని ఆ తర్వాత సహాయక దర్శకుడిగా చేసి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా అడుగులు వేస్తూ ఉన్నాడు. రాజమౌళి రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతను అప్పుడప్పుడు తన యాక్టింగ్ స్కిల్స్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు.

మొట్టమొదటిసారి రాజమౌళి తను దర్శకత్వం వహించిన సై సినిమాలోనే వేణుమాధవ్ తో ఒక సీన్లో నటించాడు. ఇక ఆ తర్వాత ఈగ సినిమా ల్లో బైకు నడుపుతూ కనిపించాడు. రెయిన్ బో, మజ్ను అనే సినిమాలలో కూడా చిన్న పాత్రలు చేశాడు. బాహుబలి 1 లో కూడా సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా రాజమౌళి అటువైపు పెద్దగా ఫోకస్ చేయలేదు.

క్యారెక్టర్ నచ్చితే మాత్రం స్క్రీన్ పై కనిపించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక రీసెంట్ గా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో కూడా ఒక కమర్షియల్ యాడ్ చేసిన విషయం తెలిసిందే. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అతను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన క్యామియో పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో గెస్ట్ పాత్రలు సినిమాకు మరింత బలాన్ని కలిగించాయి.

అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం రాజమౌళిని చాలా విభిన్నంగా ప్రజెంట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మతో పాటు విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో కనిపించారు. అయితే విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ కథలో భాగమైన పాత్రలు కాబట్టి అవి వేరు. ఇక రాజమౌళి క్యారెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అర్జీవి క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రాజమౌళి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా పేలింది.

స్క్రీన్ ప్రెజెన్స్ లో రాజమౌళి నుంచి ఇలాంటి అవుట్ ఫుట్ అయితే అసలు ఊహించి ఉండరు. నాగ్ అశ్విన్ కూడా పాత్రను డిజైన్ చేసిన విధానాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. ప్రస్తుతం చాలామంది దర్శకులు సెకండ్ ఇన్నింగ్స్ గా యాక్టింగ్ తో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే అందరికీ అది అంతగా సెట్ కావడం లేదు. కానీ రాజమౌళి మాత్రం దర్శకుడిగా హై రేంజ్ లో ఉన్నప్పుడే నటుడిగా మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. చూస్తుంటే భవిష్యత్తులో అతనికి నటుడిగా మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి రాజమౌళి యాక్టింగ్ కెరియర్ లో ఇంకా ఎలాంటి సర్ ప్రైజ్ వస్తాయో చూడాలి.

Tags:    

Similar News