రాజమౌళి ప్లానింగ్ కి తిరుగు ఉంటుందా..?

రాజమౌళి మహేష్ కాంబో సినిమాకు డైలాగ్స్ ని సాయి మాధవ్ బుర్రా రాస్తున్నారని తెలుస్తుంది.

Update: 2024-04-01 10:30 GMT
రాజమౌళి ప్లానింగ్ కి తిరుగు ఉంటుందా..?
  • whatsapp icon

RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి తను చేయబోతున్న నెక్స్ట్ సినిమా కోసం పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. రీసెంట్ గా జపాన్ లో RRR స్పెషల్ ప్రీమియర్ కోసం వెళ్లిన రాజమౌళి అక్కడ తన తర్వాత సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం స్పెషల్ అప్డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. మహేష్ తో తను సినిమా చేస్తున్నానని రాజమౌళి మన దగ్గర ఎక్కడ ప్రస్తావించలేదు కానీ జపాన్ ఆడియన్స్ కు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.

ఈ సినిమా కథ గురించి అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ సౌత్ ఆఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ బుక్స్ ఆధారంగా మహేష్ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నామని అన్నారు, ఫారెస్ట్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ అంచనాలకు మించి ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. జక్కన్న ప్లాన్ చేస్తే దానికి తిరుగు ఉండదు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

రాజమౌళి మహేష్ కాంబో సినిమాకు డైలాగ్స్ ని సాయి మాధవ్ బుర్రా రాస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ RRR సినిమాకు ఆయన మాటలు అందించారు. రాజమౌళి తెరకెక్కించే సన్నివేశానికి సాయి మాధవ్ బుర్రా మాటలు మరింత వెయిట్ తెచ్చేలా చేస్తాయి. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్ర సినిమాకు డైలాగ్స్ రాసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

రాజమౌళి మహేష్ నిర్మాతలు త్వరలో ఒక ప్రెస్ మీట్ తో సినిమా గురించి డీటైల్స్ చెబుతారని తెలుస్తుంది. భారీ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మహేష్ ని ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా రాజమౌళి చూపించబోతున్నారని అర్ధమవుతుంది. ట్రిపుల్ ఆర్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ ని టచ్ చేసిన రాజమౌళి మహేష్ సినిమాను హాలీఎవుడ్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమాను తన రెగ్యులర్ సినిమాల్లా 3, 4 ఏళ్లు కాకుండా త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి.

కేవలం తెలుగు సినిమాలతోనే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న మహేష్ రాజమౌళి సినిమాతో నేషనల్ లెవెల్ లో కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Tags:    

Similar News