శ్రీకృష్ణుడిగా నటించిన రాజమౌళి… ఎప్పుడంటే?

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి ప్రపంచ స్థాయికి తన ఇమేజ్ పెంచుకున్నారు.

Update: 2024-08-03 11:30 GMT

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి ప్రపంచ స్థాయికి తన ఇమేజ్ పెంచుకున్నారు. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం రాజమౌళి నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా ఏంటనేది వేచి చూస్తున్నారు. అలాగే ఈ సారి చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్రస్తుతం సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సుమారు 800-1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే రాజమౌళి గురించి డాక్యుమెంటరీ బయోపిక్ ని ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా తెరకెక్కించారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కి మంచి ఆదరణ లభిస్తోంది.

మోడ్రన్ మాస్టర్స్ టైటిల్ తో ఈ ఈ 1:14 గంటల నిడివితో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది. ఇందులో దర్శకుడిగా రాజమౌళి కెరియర్ గురించి పూర్తిగా ప్రెజెంట్ చేశారు. అలాగే యాక్టర్ గా శ్రీకృష్ణుడి పాత్రలో రాజమౌళి ఒక సినిమాలో నటించాడనే విషయాన్ని కూడా చూపించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. విజయేంద్రప్రసాద్, శివశక్తి దత్తా ఈ పిల్లనగ్రోవి అనే సినిమాని తీశారు. శివశక్తి దత్తా ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో సినిమాలో రాజమౌళి చైల్డ్ యాక్టర్ గా కృష్ణుడి క్యారెక్టర్ లో నటించాడు.

మూవీని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన తరువాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పూర్తిచేయలేకపోయారు. ఆ సినిమాకి సంబందించిన కొన్ని స్టిల్స్ మాత్రం ఉన్నాయి. రాజమౌళిలో గ్రేట్ యాక్టర్ ఉన్నాడని ఈ డాక్యుమెంటరీలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన స్క్రీన్ పై కనిపించడానికి ఇష్టపడరని తెలిపారు. సెట్ లో కూడా రాజమౌళి అన్ని క్యారెక్టర్స్ ని ముందుగా తాను పెర్ఫార్మ్ చేసి యాక్టర్స్ కి చూపిస్తాడు.

తరువాత అదే లెవల్ లో ఆర్టిస్ట్స్ నుంచి కూడా నటనని రాబట్టుకుంటారు. ఇదిలా ఉంటే రాజమౌళి గెస్ట్ రోల్ లో చాలా సినిమాలలో నటించాడు. రెయిన్ బో అనే మూవీలో దర్శకుడిగా తన ఒరిజినల్ క్యారెక్టర్ చేశారు. అలాగే నాని మిస్టర్ మజ్ను మూవీలో కూడా కనిపించారు. బాహుబలి లో కూడా ఐటెం సాంగ్ లో కనిపిస్తారు. రీసెంట్ గా కల్కి చిత్రంలో కూడా నటించారు. యాక్టర్ గా తన ఇంటరెస్ట్ ని మాత్రం రాజమౌళి గెస్ట్ రోల్స్ ద్వారా తీర్చుకుంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News