బాబోయ్ రజనీ... ఈ ఫోటోలు నిజమేనా? గ్రాఫిక్సా?
సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన స్థాయికి తగ్గ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు
సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన స్థాయికి తగ్గ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ పనైపోయిందని విమర్శించిన వారికి జైలర్ కలెక్షన్స్ సమాధానం చెప్పకనే చెప్పాయి అంటూ రజనీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రజినీకాంత్ ఆరోగ్యం సరిగా ఉండదు.. ఆయన సినిమాల్లో నటించడం కోసం ఎక్కువ శాతం డూప్స్ ని వాడుతూ ఉంటాడు అని కూడా కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వారు ఉన్నారు. కానీ తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రజినీకాంత్ లీక్డ్ ఫోటోలు ఆ విమర్శలకు సమాధానం అన్నట్లుగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
తలైవర్ 170 వర్కింగ్ టైటిల్ తో టి జి జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. తాజాగా షూటింగ్ కార్యక్రమాలకు రజినీకాంత్ జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. సెట్స్ నుండి రజినీకాంత్ ఫోటోలు బయటకు రావడంతో తమిళ మరియు తెలుగు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షర్ట్ లేకుండా వైట్ గడ్డం తో షార్ట్ లో రజినీకాంత్ ఫిజిక్ ని చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. కొందరు నిజంగా రజినీకాంత్ కి ఈ స్థాయి ఫిజిక్ ఉందా లేదంటే గ్రాఫిక్స్ తో ఏదైనా మాయ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ తో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం ఇవి రజినీకాంత్ రియల్ ఫోటోలు అంటూ ఫ్యాన్స్ వారికి సమాధానం చెబుతున్నారు.
జైలర్ సినిమా హిట్ నేపథ్యం లో తలైవర్ 170 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా లో మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రజినీకాంత్ జైలర్ లో ఎలా అయితే వయసుకు తగ్గ పాత్రలో కనిపించాడో ఈ సినిమాలో కూడా అలాగే కనిపించబోతున్నాడని తెల్లటి గడ్డం చూస్తూ ఉంటే అనిపిస్తుంది.
రజినీకాంత్ ను ఆయన వయసుకు తగ్గ పాత్రల్లో చూస్తేనే అభిమానులు, ప్రేక్షకులు నచ్చుతున్నారు. అందుకే ఈ సినిమాలో కూడా రజినీకాంత్ తన ఒరిజినల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఏడు పదుల వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉండటం వల్లే షర్ట్ విప్పి మరీ తన ఫిజిక్ ను రజనీకాంత్ చూపిస్తున్నారు. ప్రస్తుత యంగ్ హీరోల్లో ఎంత మంది ఏడు పదుల వయసుకు వచ్చినా ఇంత ఫిట్ గా ఉంటారు అంటే డౌటే అనే సమాధానం వస్తుంది.