రూ.15 లక్షల సాయం.. ఎవరికి తెలియనివ్వలేదు
అయితే తాజాగా నటుడు లివింగ్ స్టన్ తనకు రజినీ చేసిన సాయం గురించి చెప్పాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ దాన గుణంలో నిజంగా సూపర్ స్టార్ అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నాడు. ఇటీవల చెన్నై శివారు ప్రాంతంలో పేద వారి కోసం ఉచిత వైధ్యం అందించే ఉద్దేశ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు ఆ విషయాన్న రజినీకాంత్ బయటకు వెళ్లడించలేదు. ఆయన తాను చేసే సహాయం గురించి ప్రచారం అక్కర్లేదు అనుకుంటాడు. అందుకే ఆయన చేసిన సహాయాలు, దానాలు ఎక్కువగా ప్రచారం జరగలేదు. అయితే తాజాగా నటుడు లివింగ్ స్టన్ తనకు రజినీ చేసిన సాయం గురించి చెప్పాడు.
లివింగ్ స్టన్ తన భార్య హార్ట్ ఆపరేషన్ కు సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా రజినీకాంత్ తెలుసుకున్నారట. నిమిషాల వ్యవధిలోనే లివింగ్ స్టన్ ను పిలిచి రూ.15 లక్షల ను అందించారట. ఆ డబ్బును తీసుకునేందుకు లివింగ్ స్టన్ వెనకాడుతున్న సమయంలో నీ అన్నగా ఇస్తున్నా తీసుకో అంటూ భుజం తట్టాడట.
అంతటి మంచి మనసున్న మనిషి ఉంటాడా అనిపించింది. ఆయన చేసే సహాయం ఒక చేత్తో చేస్తే మరో చేతికి తెలియదు. అలాంటి సహాయం చేసే రజినీకాంత్ గారు ఇంకా ఎంతో మందికి సహాయం చేశారని ఆయన పేర్కొన్నాడు.
జైలర్ సినిమాతో హిట్ కొట్టిన రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల విడుదల అయిన లాల్ సలామ్ నిరాశ పరిచినా కూడా వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.