మరో ఏడాదిలో సూపర్ స్టార్ 175 కొడితే 3.ఓ!
70 ప్లస్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ వేగం మామూలుగా లేదు. ఆయన స్పీడ్ ఏకంగా యంగ్ హీరోల్ని మించి కనిపిస్తుంది
70 ప్లస్ లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ వేగం మామూలుగా లేదు. ఆయన స్పీడ్ ఏకంగా యంగ్ హీరోల్ని మించి కనిపిస్తుంది. ఇటీవలే 170వ సినిమా `వెట్టేయాన్` షూటింగ్ ముగించి 171వ చిత్రాన్ని పట్టా లెక్కించారు. `కూలీ` టైటిల్ తో దీన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్ తో `జైలర్ -2` ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. సర్వ సిద్దం చేసుకుని నెల్సన్ సిద్దంగా ఉన్నాడు.
రజనీ డేట్లు ఇవ్వడమే ఆలస్యం రంగంలోకి దూకడానికి సిద్దంగా ఉన్నారు. అలాగే హెచ్. వినోధ్ లాంటి యాక్షన్ మేకర్లు రజనీకి స్టోరీ చెప్పి క్యూలో ఉన్నారు. అయితే అతడి కంటే ముందుగా సూపర్ స్టార్ మరో డైరెక్టర్ ని లాక్ చేస్తున్నారు. కర్ణన్, మామన్నన్ లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ని లైన్ లోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా మారి సెల్వరాజ్ రివీల్ చేసారు. రజనీకి నేనంటే ఇష్టం.
నాగత విజయాలు రెండు చూసి ఫోన్ చేసి అభినందించారు. ఇద్దరం కలిసి సినిమా చేయాలను కుంటున్నాం. ప్రస్తుతానికి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి` అని తెలిపారు. దీంతో ఇద్దరు ప్రాజెక్ట్ విషయంలో వేగంగానే ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. సూపర్ స్టార్ వేగంచూస్తుంటే 2025 కల్లా 175 చిత్రాలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 171 కూలీ సెట్స్ లో ఉంది.
ఇది ఏడాది చివరకల్లా పూర్తవుతుంది. అటుపై 172 గా `జైలర్ -2` పట్టాలెక్కొచ్చు. ఈలోపు మారిసెల్వరాజ్ స్టోరీ ఒకే అయితే 173 అవుతుంది. హెచ్. వినోద్ కూడా చాలా కాలంగా లైన్ లో ఉన్నాడు. అతడికి ఒకే చెబితే 174 అతనికే సొంతం. వీళ్లంతా అధికారికంగా సూపర్ స్టార్ తో టచ్ లో ఉన్నవారు. మరోటి లాక్ అయితే నెంబర్ 175 అవుతుంది. వీటిని 2025 కల్లా షూట్ పూర్తి చేయగల్గితే రజనీ 3.ఓ నే.