ఆ బ‌యోపిక్ టైటిల్ వెనుక అత‌డున్నాడా?

అయితే ఈ సినిమాకి ఇప్ప‌టికే 'శ్రీ' అనే టైటిల్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడా టైటిల్ ని మార్చేసారు. శ్రీకాంత్ అనే కొత్త టైటిల్తో సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Update: 2024-03-31 11:30 GMT

బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు న‌ట‌నానైపుణ్యం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ కి దొరికిన గొప్ప న‌టుడిగా రాజ్ కుమార్ రావుని కీర్తించొచ్చు. ఎలాంటి పాత్ర‌కైనా ప్రాణ ప్ర‌తిష్ట చేయ‌గ‌ల న‌టుడు. అదీ బ‌యోపిక్ ల్లో ..వాస్త‌వ క‌థ‌ల పాత్ర‌లో రాజ్ కుమార్ రావు ఎలా ఒదిగిపోతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ కి దొరికిన ఓ ఆణిముత్యంగా రాజ్ కుమారావుని ఇండ‌స్ట్రీ గుర్తిస్తుంది. తాజాగా రాజ్ కుమార్ రావు తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లం జీవిత క‌థ‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తుషార్ హిరానందానీ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అల‌య.ఎఫ్‌..జ్యోతిక కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. చాలా కాలంగా సెట్స్ లో ఉన్న సినిమా ఎట్ట‌కేల‌కు మేలో రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి ఇప్ప‌టికే 'శ్రీ' అనే టైటిల్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడా టైటిల్ ని మార్చేసారు. శ్రీకాంత్ అనే కొత్త టైటిల్తో సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముందుగా 'శ్రీ' అని పెట్ట‌డం..ఇప్పుడు మార్చ‌డం వెనుక అస‌లు క‌థ ఏంటి? అంటే ఇంట్రెస్టింగ్ విష‌యాలు బ‌య‌టకు వ‌స్తున్నాయి.

'శ్రీ 'టైటిల్ తో సినిమా రిలీజ్ వ‌ద్ద‌ని...త‌న పూర్తి పేరుతోనే రిలీజ్ చేయాల‌ని శ్రీకాంత్ మేక‌ర్స్ ని కోరారుట‌. దీంతో మేక‌ర్స్ టైటిల్ మార్చిన‌ట్లు తెలుస్తోంది. తొలుత టైటిల్ ని చిత్ర‌బృందం నుంచే పున‌ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ అస‌లు సంగ‌తి శ్రీకాంత్ మార్పు కోర‌డంతోనే మార్చిన‌ట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ బొల్లం జీవితం ఎంతో స్ఫూర్తిదాయం. అత‌నికి పుట్ట‌క‌తోనే దృష్టి లోపుం ఉంది. అయినా త‌న‌కంటూ చ‌రిత్ర‌లో కొన్ని పేజీలు రాసిపెట్టారు. వైక‌ల్యం ఉన్నా శ్రీకాంత్ ల‌క్ష్యం ముందు చిన్న‌దిగానే క‌నిపిపించింది.

ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కుని గొప్ప పారిశ్రామ‌విక వేత్త‌గా ఎదిగారు. బోలాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడి గా ఖ్యాతికెక్కారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్‌లో మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి గాను శ్రీకాంత్ రికార్డు నెల‌కొల్పారు. శ్రీకాంత్ చిన్న నాటి నుంచి ఎంతో తెలివైన విద్యార్ధి. అత‌నిలో ఆ ప్ర‌తిభ‌నే ఇంత గొప్ప‌వాడిని చేసింద‌ని బ‌లంగా నమ్మే వ్య‌క్తి ఆయ‌న‌. శ్రీకాంత్ బొల్లాం స్వ‌స్థ‌లం మ‌చిలీప‌ట్నం.

Tags:    

Similar News