రాజ్ కుమార్ - రాజ్ హిరాని.. ఇది మ్యాటర్

షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

Update: 2023-12-31 08:40 GMT

బాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాని ఒకరు. తీసింది తక్కువ సినిమాలే అయినా ఈయన ఫిలిం మేకింగ్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబిబిఎస్, సంజు, పీకే వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈయన తాజాగా 'డంకి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

రాజ్ కుమార్ హిరానీ గత చిత్రాల మాదిరిగానే ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు కానీ.. రాజ్ కుమార్ హిరానీ నుండి వచ్చిన పీకే, 3 ఇడియట్స్ రేంజ్ లో భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ పై ఉన్న నమ్మకమే.

అయితే ఈసారి డంకి ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అలా అని సినిమా మొత్తానికే ప్లాప్ అవ్వలేదు. కాకుంటే రాజ్ కుమార్ హిరాని గత సినిమాల రేంజ్ లో లేకపోవడంతో బాక్సాఫీస్ వద్దా డంకి పర్వాలేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ హిరాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు తెరపై వచ్చిన విషయం తెలిసిందే కదా.

ఆ మధ్య చరణ్ కూడా ముంబై వెళ్లి రాజ్ కుమార్ ని కలవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిందని, ఈ ప్రాజెక్టు తోనే రామ్ చరణ్ బాలీవుడ్ లో మళ్లీ రీ లాంచ్ అవుతున్నట్లు న్యూస్ తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదు. కానీ నాకు రామ్ చరణ్ తెలుసు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతం.. అంటూ చెప్పుకొచ్చారు రాజ్ కుమార్ హిరానీ. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందన్న రూమర్స్ కి పులిస్టాప్ పడినట్లు అయింది. అయితే వీరి కాంబో ఇప్పట్లో సినిమా లేదనే మాట వాస్తవమే కానీ రాజ్ కుమార్ హిరాని కామెంట్స్ ని బట్టి చూస్తే ఫ్యూచర్లో కచ్చితంగా రామ్ చరణ్ తో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    

Similar News