రాజ్ తరుణ్, లావణ్య వివాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..
రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది
రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. గతంలో టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఇలాంటి వైవాహిక సంబంధమైన గొడవల్ని ఎదుర్కోలేదు. సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకొని తరువాత విడిపోయిన వారు ఉన్నారు. అలాగే లివింగ్ రిలేషన్ లో కొంతకాలం ఉండి దూరమైనా జంటలు కూడా ఉన్నాయి. అయితే రాజ్ తరుణ్ మాత్రం మొదటి సారి తన మాజీ ప్రేయసి లావణ్య కారణంగా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది.
లావణ్య, రాజ్ తరుణ్ 11 ఏళ్లు కలిసి సహజీవనం చేశారనేది బయట జరుగుతున్న ప్రచారం. అయితే ఎంతకాలం అనేది ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారు. 2017 నుంచి లావణ్యకి నేను దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. ఏడాది ముందు వరకు రాజ్ తరుణ్ నేను కలిసున్నాం. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని లావణ్య చెబుతోంది. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న తర్వాత నుంచి రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని లావణ్య ఆరోపిస్తోంది.
మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ మీద చాలా రకాలుగా ఆరోపణలు చేస్తోంది. అతనికి చాలా మంది హీరోయిన్స్ తో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని లావణ్య ఆరోపణలు చేసింది. ఇప్పటికే పోలీసులు రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేశారు. నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రాజ్ తరుణ్ ఇన్ని రోజులు వాటికి సమాధానం చెప్పలేదు. మీడియా ముందుకొచ్చి కూడా మాట్లాడలేదు. దీంతో రాజ్ తరుణ్ మీద లావణ్య చేస్తోన్న ఆరోపణలకి బలం చేకూర్చినట్లు అయ్యింది. రాజ్ తరుణ్ విషయంలో లావణ్య తప్పులు చేసినట్లు చాలా ఆడియో రికార్డ్స్ బయటికి వస్తున్నాయి. మస్తాన్ సాయితో ఆమె ఎఫైర్ నడిపిందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేస్తున్నారు.
అయితే అవి వాస్తవం అంటూ శేఖర్ భాష లావణ్యకి వ్యతిరేకంగా బలమైన సాక్షాలు మీడియాకు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు నుంచి శేఖర్ భాషకి మద్దతు లభిస్తోంది. గతంలో డ్ర*గ్స్ సప్లై కేసులు పట్టుబడి లావణ్య 45 రోజులు జైల్లో ఉంది. పక్క ఆధారాలతో దొరికిపోవడం వలన జైలు శిక్ష అనుభవించిందని శేఖర్ భాష ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ కూడా లావణ్య హెవీగా డ్రగ్స్ తీసుకుంటుందని గతంలో తెలిపారు. చాలామందితో కలిసి ఆమె రెగ్యులర్ గా డ్ర*గ్స్ వాడుతుందని అన్నారు. గతంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయితే ఆ కేసు రాజ్ తరుణ్ పెట్టనన్నట్లు లావణ్య చెబుతున్న దానిని పబ్లిక్ పెద్దగా నమ్మడం లేదు.
తనని గర్భవతి చేసాడని రాజ్ తరుణ మీద లావణ్య ఆరోపణలు చేస్తున్న దానికి బలమైన సాక్ష్యాలు అయితే చూపించలేదు. ఆ కోణంలో కూడా కేసు నమోదు చేయలేదు. దీంతో అబార్షన్ అనే ఆరోపణలు వాస్తమని ప్రజలు నమ్మడం లేదు. రాజ్ తరుణ్ అయితే తన దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. డ్రగ్స్ కేసులో లావణ్య పట్టుబడినప్పుడు రాజ్ తరుణ్ ఇన్వాల్వ్ కాలేదు. ఆ తర్వాత నుంచి లావణ్యకి రాజ్ తరుణ్ దూరమయ్యాడు. రాజ్ తరుణ్ కెరీర్ ని నాశనం చేయాలని ఉద్దేశంతోనే లావణ్య మీడియా ముందుకు వచ్చి అతనిపై ఆరోపణలు చేస్తుందని కొంతమంది నమ్ముతున్నారు.
అయితే లావణ్యకి అన్యాయం జరిగిందని కొంతమంది ఆమెకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. కలిసి కాపురం చేసిన తర్వాత వదిలించుకోవడానికి గతంలో జరిగిన గొడవలను తెరపైకి రాజ్ తరుణ్ తీసుకొస్తున్నారని అంటున్నారు. రాజ్ తరుణ్ శేఖర్ భాషాని అడ్డుపెట్టుకొని ఆమెపై వ్యక్తిత్వాహనానికి పాల్పడుతున్నారని మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్న చట్ట పరిధిలోకి వెళ్ళిన తర్వాత వాటికి లోబడి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందే అనే మాట వినిపిస్తోంది.