లావణ్యతో మస్తాన్… రాజ్ తరుణ్ తో మాల్వీ!

రాజ్ తరుణ్ తిరగబడర సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని నన్ను దూరం చేసాడని అతని ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేస్తోంది

Update: 2024-07-06 06:22 GMT

రాజ్ తరుణ్ తిరగబడర సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని నన్ను దూరం చేసాడని అతని ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేస్తోంది. మాల్వీ మల్హోత్రాతో లావణ్య మాట్లాడిన ఆడియో రికార్డ్స్ ని కూడా బయటకొచ్చాయి. వీటి ద్వారా తన వాదన కరెక్ట్ అని లావణ్య గట్టిగానే వాదిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి రాజ్ తరుణ్ మోసం చేసాడని బలంగా చెబుతోంది.

లావణ్యకి కౌంటర్ గా రాజ్ తరుణ్ కూడా ఆమెపై అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. లావణ్య గతంలో మస్తాన్ అనేవాడితో రిలేషన్ లో ఉందని, నా మీద ఇప్పుడు కేసు పెట్టినట్లే మస్తాన్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ గుంటూరులో పోలీసులకి ఫిర్యాదు చేసిందని మీడియాతో తెలిపాడు. ఆ ఫిర్యాదుకి సంబందించిన కాపీలు తన దగ్గర ఉన్నాయని రాజ్ తరుణ్ అంటున్నాడు. అలాగే నాతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే మస్తాన్ తో ఆమె కలిసి తిరిగేదని ఆరోపణలు చేశాడు.

తాను ఏ పని చేయడం లేదని, డ్రగ్స్ కి బాగా అలవాటు పడిందని రాజ్ తరుణ్ అన్నాడు. డ్రగ్స్ కోసం నన్ను ఇప్పటికప్పుడు డబ్బులు అడిగేదని తెలిపాడు. అయితే కెరియర్ ఆరంభంలో తనకి షెల్టర్ ఇచ్చిందనే కృతజ్ఞతతో సాయం చేస్తూ వచ్చానని అన్నాడు. మొదటి సినిమా రిలీజ్ తర్వాత మేమిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామని, అది కొంతకాలం మాత్రమేనని తెలిపాడు. ఆమెపైన గతంలో చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

డ్రగ్స్ కేసులో ఆమె జైలుకి వెళ్లిన తర్వాత నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని లావణ్య నుంచి దూరంగా వచ్చేశానని రాజ్ తరుణ్ చెప్పాడు. త్వరలో లావణ్యపై అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని అలాగే మాల్వీ మల్హోత్రా కూడా ఫిర్యాదు చేస్తుందని తెలిపాడు. ఆమెపై కంప్లైంట్ చేసాక మొత్తం అన్ని వివరాలు మీడియాకి తెలియజేస్తానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. లావణ్యని నేను అన్ని చోట్ల బ్లాక్ చేశానని, దీంతో ఆమె తమ్ముడితో ఫోన్ చేయించి డబ్బులు డిమాండ్ చేసిందని తెలిపాడు.

అలాగే నా బంధువులు, ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం, బ్లాక్ మెయిల్ చేయడం చేస్తుందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఇంట్లో వినాయక పూజ చేయడం అనేది నాకు మొదటి నుంచి అలవాటుందని, ప్రతి ఏడాది వినాయకచవితి రోజున పూజలు చేస్తానని చెప్పారు. తనతో రిలేషన్ లో ఉన్నప్పుడు కలిసి పూజ చేసిన మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ అన్నాడు. అయితే మాల్వీ మల్హోత్రా నేను రిలేషన్ షిప్ లో ఉన్నామనేది పచ్చి అబద్ధం అని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు.

వీరిద్దరి గొడవ చూస్తుంటే మరింత తీవ్రతరం అయ్యేలానే కనిపిస్తుంది. రాజ్ తరుణ్ చేసిన ఆరోపణలు, విమర్శలపై లావణ్య కూడా రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇస్తుంది. అయితే వీరిద్దరి పంచాయితీలో వాస్తవాలు ఏంటనేది పోలీసులు విచారణ చేసి బయటపెడితే కానీ పూర్తిగా తెలియదు.

Tags:    

Similar News