ఒకే హ్యాట్ కింద ఇద్ద‌రు మిత్రులు

ర‌కుల్ ప్రీత్ సింగ్- ప్ర‌గ్య జైశ్వాల్ స్నేహం గురించి తెలిసిందే. ముంబైలో ఈ భామ‌లిద్ద‌రి స్నేహం ఎప్పుడూ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తూనే ఉంది

Update: 2024-10-10 16:04 GMT

ర‌కుల్ ప్రీత్ సింగ్- ప్ర‌గ్య జైశ్వాల్ స్నేహం గురించి తెలిసిందే. ముంబైలో ఈ భామ‌లిద్ద‌రి స్నేహం ఎప్పుడూ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తూనే ఉంది. ఆ ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా ఎంత‌ బిజీగా ఉన్నా ఒక‌రితో ఒక‌రు ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. ప్ర‌తిసారీ పార్టీలు, వేడుక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా క‌లిసే ప్ర‌త్య‌క్ష‌మవుతున్నారు.

ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ 34వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌గ్య ఒక అంద‌మైన ఎమోష‌న‌ల్ నోట్ తో విషెస్ తెలియ‌జేసింది. ప్ర‌గ్య రాసిన నోట్ సారాంశం ఇలా ఉంది. ``పుట్టినరోజు శుభాకాంక్షలు సన్‌షైన్ ర‌కుల్ ప్రీత్..

నువ్వే మా జీవితాలకు వెలుగు..మీకు ప్రేమ, అంతులేని నవ్వు, గొప్ప ఆహారం, అందమైన ప్రయాణాలు, అద్భుతమైన పని & మాతో కొన్ని సూపర్ సరదా సమయాలు ఉండాలని కోరుకుంటున్నాను`` అని ర‌కుల్ విష్ చేసింది. లవ్ యు టు ది మూన్ & బ్యాక్.. అందరి అభిమానం! అంటూ ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చింది.

ప్ర‌గ్య బీచ్ వెకేష‌న్ నుంచి షేర్ చేసిన హా* ఫోటోగ్రాఫ్స్ వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. ఓ ఫోటోగ్రాఫ్‌లో ర‌కుల్ హ్యాట్ ధ‌రించి క‌నిపించింది. ఆ ఇద్ద‌రూ బ్లాక్ షేడ్స్ లో స్టైలిష్ గా ఫోజులిచ్చారు. ఒకే హ్యాట్ కింద ర‌కుల్-ప్ర‌గ్య జోడీ న‌వ్వులు చిందిస్తూ ఫోజులివ్వ‌డం ఎంతో అందంగా కుదిరింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో స్పీడ్ గా వైర‌ల్ అవుతోంది.

అక్టోబర్ 10, గురువారం నాడు రకుల్ ప్రీత్ సింగ్ తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్భంలో, ఆమె భర్త జాకీ భగ్నాని వారి జీవితంలోని ముఖ్యమైన మూవ్ మెంట్స్ కి సంబంధించిన ఆక‌ట్టుకునే వీడియోను షేర్ చేసారు. దీనికి జాకీ అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చారు. బీవీ నం.1 (ర‌కుల్ ని అలా పిలుస్తాడు) తనను సజీవంగా ఉన్న అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఎలా చేసిందో హైలైట్ చేస్తూ నోట్ రాసాడు. జాకీ వారి ఫోటోషూట్‌లు, ఈవెంట్‌లు వివాహం, వివాహానంతర విహారయాత్రల నుండి చక్కగా రూపొందించిన ఫోటోల‌ కోల్లెజ్‌ను షేర్ చేసారు. ర‌కుల్ ఇటీవ‌లే భార‌తీయుడు 2లో క‌నిపించింది. త‌దుప‌రి దే దే ప్యార్ దే 2లో అజయ్ దేవగన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. T-సిరీస్ - లవ్ రంజన్‌ల మద్దతుతో ఈ చిత్రం 1మే 2025న థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News