పెళ్లి తర్వాత రకుల్ తగ్గేదేలే!
రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ వివాహంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 22న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతుంది
రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ వివాహంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 22న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రకంగా 2024 ఏడాది ఆరంభంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న తొలి జోడీగా రకుల్-జాకీ నిలిచారు. ప్రేమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్తారా? డేటింగ్ తోనే సరిపెడతారా? అని ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చిన అన్నింటికి పెళ్లి తో పుల్ స్టాప్ పెట్టేయడం అభిమానుల్ని ఆనందాన్ని ఇస్తుంది.
రకుల్ కి మునుపెన్నడు ఎలాంటి ఎఫైర్లు లేవు. కనీసం గాసిపు కూడా తెరపైకి రాలేదు. జీవితంలో ఒకరినే ప్రేమించింది..అతన్నే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పట్ల అభిమానులు అంతా ఆమెని హర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది కొందరిలో సందేహంగా మారింది. వృత్తిని..వ్యక్తిగత జీవితాన్ని వేరు చేసి చూస్తుందా? రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుందా? అందుకు నిర్మాతగా జాకీ ఒప్పుకుంటాడా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా వాటన్నింటిపై రకుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఈ సందేహాలన్నింటిని రకుల్ ముందు కు తీసుకెళ్లేసరికి ఆమె కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చేసింది. పెళ్లి తర్వాత కూడా నేను సినిమా ల్లో కొనసాగాలనుకుంటున్నాను. అందరి అంగీకారంతోనే ముందుకు వెళ్తాను. వివాహం తర్వాత వృత్తిలో కొనసాగడం అన్నది కొత్త అనుభూతినిస్తుందని నేను భావిస్తున్నాను. ఎవరి వృత్తుల్లో వారు యధా విధిగా కొనసాగడంలో తప్పేముంది.
ప్రేక్షకుల్ని అలరించాలని తెరమీదకు వస్తున్నాం. అందుకు పెళ్లి అడ్డంకి కాదు' అని చెప్పుకొచ్చింది. దీంతో రకుల్ వివాహం తర్వాత యాధావిధిగా వృత్తిలో కొనసాగుతుందని తెలుస్తుంది. భాగస్వామి జాకీ భగ్నానీతో ఈ విషయంలో మంచి అండర్ స్టాండింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. జాకీ నిర్మాత కావడంతో రకుల్ ని అన్ని రకాలుగా అర్దం చేసుకునే అవకాశం ఉంటుంది.