RAPO 22 : మన సాగర్ గాడి లవ్వు.. ఎంత క్యూట్ గా ఉందో..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని.. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో RAPO 22 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. న్యూ ఏజ్డ్ స్టోరీతో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మూవీలో రామ్.. సాగర్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మేకర్స్ రామ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ.. మీకు సుపరిచితుడు మీలో ఒకడు మీ సాగర్ అంటూ పరిచయం చేశారు.
ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రేమతో ఈ కొత్త సంవత్సరం అంటూ నిన్న పోస్ట్ పెట్టిన మేకర్స్.. నేడు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. భాగ్యశ్రీ బొర్సే లుక్ ను రివీల్ చేశారు. మన సాగర్ గాడి లవ్.. మహాలక్ష్మి అంటూ హీరో హీరోయిన్లు ఉన్న క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అయితే పోస్టర్ లో భాగ్యశ్రీ చాలా క్యూట్ గా ఉన్నారు. ట్రెడిషనల్ వేర్ చూడీదార్ లో ఉన్న భాగ్యశ్రీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సింపుల్ గా అండ్ గోర్జియస్ గా ఉన్నారని చెప్పాలి. ఇక రామ్ లుక్ అయితే ఫుల్ రిఫ్రెషింగ్ ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టేశారు. రామ్, భాగ్య కాలేజీకి వెళ్తున్నట్లు అర్థమవుతోంది.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అట్రాక్టివ్ గా ఉంది. ఓవరాల్ గా పోస్టర్.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పోస్టర్ బట్టి.. డైరెక్టర్ ఈసారి కూడా ఫ్రెష్ కంటెంట్ తో రానున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు డైరెక్టర్ తెలిపారు. కీలక సీన్స్ షూట్ చేశామని, రామ్- భాగ్యశ్రీ జోడీ సో క్యూట్ అంటూ కొనియాడారు.
ఇక సినిమా విషయానికొస్తే.. RAPO 22తో టాలీవుడ్ కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ పరిచయం అవుతున్నారు. తమిళ నాట ఇప్పటికే పలు చిత్రాలకు వర్క్ చేసిన వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తుండగా, మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి RAPO 22 ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.