గేమ్ చేంజర్… మళ్ళీ ఏదో షాక్ ఇచ్చేలా ఉన్నారు?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుచి రాబోయే గేమ్ చేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుచి రాబోయే గేమ్ చేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ళ క్రితం ఈ సినిమాని శంకర్ స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 మూవీ కూడా తిరిగి స్టార్ట్ చేయడంతో గేమ్ చేంజర్ షూటింగ్ కి చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకి షూటింగ్ కంప్లీట్ చేసుకొన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సెకండ్ సింగిల్ ని ఈ నెలలో రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఒక పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ అటెన్షన్ మొత్తం ఒక్కసారిగా సినిమాపైకి వచ్చేలా అదిరిపోయే అప్డేట్ ని ఇవ్వాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
గేమ్ చేంజర్ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. అయితే డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. కచ్చితంగా క్రిస్మస్ కి గేమ్ చేంజర్ మూవీ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు సడెన్ గా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే విధంగా ఊహించని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ 2025కి వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది.
డిసెంబర్ నెల ఆరంభంలో పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. తరువాత కూడా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలాగే డిసెంబర్ 20న నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వీటికి పోటీగా గేమ్ చేంజర్ ని రిలీజ్ చేస్తే అన్ని సినిమాలకి నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే 2025 ఆరంభంలో మంచి రిలీజ్ డేట్ చూసుకొని గేమ్ చేంజర్ ని విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. అయితే రిలీజ్ డేట్ వాయిదాపై దిల్ రాజు టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ వాయిదా వాస్తవం కాకపోవచ్చని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఏదైనా దిల్ రాజు నుంచి ప్రకటన వచ్చే వరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఉండే ఛాన్స్ లేదు. ఒక వేళ గేమ్ చేంజర్ మూవీ వాయిదా పడితే మాత్రం కచ్చితంగా సినిమాపై మరింతగా హైప్ తగ్గిపోయే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.