టీడీపీ సేన కాంబో కోసం హరిరామజోగయ్య పీపుల్స్ మేనిఫేస్టో
ఆ వివరాలను ఆయన మీడియాకు రిలీజ్ చేస్తూ వీటిని కనుక టీడీపీ జనసేన జాయింట్ గా ఎన్నికల ప్రణాళికగా పెడితే వచ్చేది విపక్ష కూటమి ప్రభుత్వమే అని స్పష్టం చేస్తున్నారు.
ఏపీ అంటేనే సంక్షేమ పధకాలు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇచ్చేసారు. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వైసీపీని గద్దె దించాలంటే పధకాలతోనే కొట్టాలని వృద్ధ నేత, సీనియర్ మోస్ట్ లీడర్ చేగొండి హరిరామజోగయ్య అంచనాకు వచ్చారు. ఆయన తాజాగా కాపు సేన నాయకుడు కూడా.
ఆయన తనదైన శైలిలో ఒక ఇరవై మందిని బృందంగా చేసుకుని పీపుల్స్ మేనిఫేస్టో ని తయారు చేశారు. ఆ వివరాలను ఆయన మీడియాకు రిలీజ్ చేస్తూ వీటిని కనుక టీడీపీ జనసేన జాయింట్ గా ఎన్నికల ప్రణాళికగా పెడితే వచ్చేది విపక్ష కూటమి ప్రభుత్వమే అని స్పష్టం చేస్తున్నారు.
ఇంతకీ అంతలా ఆకట్టుకునే పధకాలను ఏమిటి జోగయ్య తన పీపుల్స్ మ్యానిఫేస్టోలో కొన్ని ఆకర్షణీయమైన హామీలనే జోడించారు. అవేంటి అంటే పేద కుటుంబానికి ప్రతీ నెల అయిదు వేల రూపాయలు వంతున ఇవ్వడం బ్రహ్మాస్త్రం లాంటి హామీగా ఉంది. అలాగే పెళ్ళి కాని ఆడపిల్లకు వివాహం కోసం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కూదా ఉంది.
ఇలాంటివే చాలా హామీలను దట్టించారు. ఏకంగా 47 పధకాలను పేదలకు తెచ్చేలా హామీలు ఇస్తూ ఈ పీపుల్స్ మ్యానిఫేస్టోని రూపకల్పన చేశారు. ఈ మ్యానిఫేస్టో మొత్తం అమలు చేయడానికి ఏడాదికి డెబ్బై అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా లెక్క వేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమంత ఆర్థిక భారం కాదని జోగయ్య అంటున్నారు.
ఇక ఈ పధకాలు అన్నీ అందరికీ కావు అని జోగయ్య స్పష్టం చేస్తున్నారు. కేవలం తెల్ల కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పధకాలను అందచేసేలా నిబంధనలు పెడుతున్నట్లుగా వివరించారు. ఈ పీపుల్స్ మ్యానిఫేస్టోని జనసేన నేత నాదెండ్ల మనోహర్ కి ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. దీన్ని తప్పనిసరిగా అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని జోగయ్య చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో జనసేన టీడీపీ కూటమిలోకి తొందర్లోనే బీజేపీ కూడా వచ్చి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తుననరు. అదే విధంగా ఏపీలో విపక్షానికి అధికారం దక్కడం ఖాయమని అంటున్నారు. జోగయ్య జనసేన శ్రేయోభిలాషిగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఆయన ఈ వయసులో కూడా సంకల్పించి మరీ పీపుల్స్ మ్యానిఫేస్టోని తయారు చేశారు అని అంటున్నారు.
కాపులకు రాజ్యాధికారం దక్కాలని అలా జరగాలంటే జనసేనకు పొత్తులలో ఎక్కువ సీట్లు దక్కాలని కూడా జోగయ్య కోరుతూ వస్తున్నారు మరి జోగయ్య కోరికలు ఆశలు నెరవేరుతాయా అన్నది చూడాలి. చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక అంటూ మిని మ్యానిఫేస్టోని తయారు చేసి ఇప్పటికే విడుదల చేశారు. జనసేన మరో అయిదు హామీలను పవన్ వారాహి యాత్రలో ప్రకటించారు.
ఇపుడు వాటికి అదనంగా వీటిని జత చేసి జనంలోకి వెళ్తారా అన్నది చర్చగా ఉంది. అసలు జోగయ్య ఇచ్చిన పీపుల్స్ మ్యానిఫేస్టో మీద జనసేన టీడీపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది కూడా చూడాలని అంటున్నారు.