డబుల్ ఇస్మార్ట్.. నెవ్వర్ బిఫోర్ బ్యాంగ్
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డిజాస్టర్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డిజాస్టర్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ మూవీ ఉండబోతోంది. శంకర్ క్యారెక్టర్ మాత్రమే ఈ చిత్రంలో కొనసాగిస్తూ మిగిలిన స్టోరీ మొత్తం పూరి జగన్నాథ్ చేంజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రామ్ పోతినేని ది వారియర్, స్కంద సినిమాలతో వరుసగా రెండు డిజాస్టర్ లు చూశాడు. ఈ సినిమాలతో మాస్ హీరోగా సక్సెస్ కొట్టాలని చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ కాలేదు. అయితే రామ్ కి ఇస్మార్ట్ శంకర్ మూవీతో పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అందుకే మళ్ళీ అతన్నే నమ్ముకొని డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. పవర్ ఫుల్ మాఫియా డాన్ గా అతని పాత్ర ఉండబోతోంది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందంట. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని లెవల్ లో ఈ సీన్ ఉండబోతోందని సమాచారం.
ఇందులోనే రామ్ లో రెండో క్యారెక్టర్ బయటకి రావడంతో పాటు, కావ్య థాపర్ తో లవ్ స్టోరీకి సంబందించిన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందంట. అలాగే ఫ్యామిలీ ఎమోషన్ హైలైట్ అయ్యేలా పూరి జగన్నాథ్ ఈ సీన్ ని డిజైన్ చేశారంట. సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ హైలైట్ గా ఉండబోతోందంట. కచ్చితంగా పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ తో పాటు రామ్ అభిమానులు కూడా ఈ సీక్వెన్స్ కి విజిల్స్ వేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బ్యాక్ టూ ఫామ్ అనిపించుకోవాలని పూరి జగన్నాథ్ గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. లైగర్ తో పోయిన ఇమేజ్ ని మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబెట్టుకోవాలని కసిగా పని చేస్తున్నారు. రామ్ కి కూడా ఈ మూవీతో కచ్చితంగా హిట్ రావాలి. మరి వీరికి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాలి