రామాయణం.. షాకిస్తున్న స్టార్ల పారితోషికాలు
ప్రత్యేకించి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి స్టార్లు అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నారు.
నితీష్ తివారీ `రామాయణం` నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఏకంగా 750కోట్లు పైగా ఖర్చు చేయనున్నారని సమాచారం. ఎంపిక చేసుకున్న బడ్జెట్ కి తగ్గట్టే స్టార్ల పారితోషికాలు చుక్కల్లో ఉన్నాయని తెలుస్తోంది. ప్రత్యేకించి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి స్టార్లు అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నారు.
శ్రీరాముడిగా రణబీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. రావణుడిగా యష్ నటిస్తున్నారు. రామాయణం కోసం రణబీర్ కపూర్ తీసుకుంటున్న పారితోషికం సాయి పల్లవి కంటే 11 రెట్లు ఎక్కువ. రామాయణంలో సీత పాత్ర పోషించినందుకు సాయి పల్లవి 6 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. తన మునుపటి ప్రాజెక్ట్‌ల కోసం రూ. 2.5 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు వసూలు చేసింది. అంటే రామాయణం కోసం సాయిపల్లవి తన పారితోషికం రెట్టింపు చేసింది. మూడు భాగాల కోసం సాయి పల్లవి 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని అంచనా.
రామాయణం కోసం రణబీర్ కపూర్ ప్రతి చిత్రానికి రూ. 75 కోట్లు తీసుకుంటాడు. అంటే మూడు భాగాల రామాయణం కోసం రూ. 225 కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించే వీలుంది. పోల్చి చూస్తే సాయి పల్లవి కంటే 2400 శాతం ఎక్కువ పారితోషికం రణబీర్ అందుకుంటున్నాడు. మొదటి సినిమా సాధించే విజయం ఆధారంగా రణబీర్ కపూర్ రామాయణం పారితోషికం మారవచ్చు అని కూడా తెలుస్తోంది.
ఈ ఇతిహాసంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించడానికి యష్ భారీ ప్యాకేజీని అందుకోబోతున్నాడు. K.G.F స్టార్ ఒక్కో సినిమాకి 50 కోట్లు అందుకోనున్నాడు. అంటే మూడు భాగాల కోసం ఏకంగా 150 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇతర స్టార్లకు కోట్లలో పారితోషికాలు ముడుతున్నాయి. పారితోషికాల రేంజుకు తగ్గట్టే స్టార్లు ఏళ్ల తరబడి చిత్రబృందం పని కట్టుబాట్ల కోసం కాల్షీట్లు కేటాయించాల్సి ఉంది.
రామాయణం తాజా షెడ్యూల్ రామాయణం ప్రస్తుతం సెట్స్ లో ఉంది. అరుణ్ గోవిల్, లారా దత్తా సెట్స్‌లో కనిపించిన ఫోటోలు ఇంతకుముందు లీకయ్యాయి. ఈ చిత్రంలో రాజా దశరథ్‌గా అరుణ్ గోవిల్ నటిస్తుండగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్నారు. ఈ నెలలో రణబీర్ కపూర్ రామాయణం షెడ్యూల్‌లో పాల్గొంటారని, సాయి పల్లవి , యష్ జూలైలో మాత్రమే షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇటీవల అయోధ్యలో రామాయణం కోసం 11 కోట్ల రూపాయల విలువైన సెట్‌ను నిర్మించారు.
ఈ సెట్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాల్సి ఉంది. రామాయణం బృందంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా సాక్షి తన్వర్, లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి తదితరులు నటిస్తున్నారు. రామాయణం మొదటి భాగం 2025లో విడుదల కానుంది.
రామాయణం 3 భాగాల్లో శ్రీరాముని జీవితంలోని వివిధ దశలను తెరకక్కిస్తారు. రాముని పుట్టుక, సీతతో వివాహం, అజ్ఞాతవాసం, రావణుడితో పోరాటం, ముగింపు ఇలా వరుస అంకాల్ని వరుస చిత్రాల్లో చూపిస్తారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి పల్లవి సీతాదేవి లాంటి ఐకానిక్ పాత్రతో బాలీవుడ్‌లోకి ప్రవేశించడం చూసి అభిమానులు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నారు.