గురుశిష్యలిద్దర్నీ ఒకేసారి సెట్స్ కి తీసుకెళ్తాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురుశిష్యులు సుకుమార్-బుచ్చిబాబుతో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురుశిష్యులు సుకుమార్-బుచ్చిబాబుతో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరితో ఒకేసారి సినిమాలు ప్రకటించి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ చాలా కాలంగా నలుగుతోన్న సుకుమార్ సినిమా మాత్రం సడెన్ గానే తెరపైకి వచ్చింది. చేస్తారను కున్నారుగానీ ఇంత వేగంగా చేతులు కలుపుతారని ఎవరూ ఊహించలేదు. 20వతేదిన బుచ్చిబాబు సినిమాని ప్రారంభిస్తే రేపోమాపో సుకుమార్ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడు చరణ్.
ఇప్పటికే రెండు సినిమాలు 2025 లోనే రిలీజ్ అవుతాయని బలంగా వినిపిస్తుంది. `గేమ్ ఛేంజర్` ప్రచారం పనులు కూడా మొదలు కావడంతో చిత్రీకరణ ముగింపుకు వచ్చేసిందని తెలుస్తోంది. ఎలా లేదన్నా చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేసేస్తారు. మరికొన్ని రోజుల్లోనే చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ పూర్తిగా ముగించు కుని బయటకు వచ్చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు-సుకుమార్ చిత్రాన్ని ఒకేసారి పట్టాలెక్కిస్తాడా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
ముందుగా బుచ్చిబాబు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఆరు నెలల్లోనూ పూర్తి చేయాలని బుచ్చిబాబుకు ఓ కండీషన్ ఉంది. ఏప్రిల్ నుంచి షూట్ లో పాల్గోన్న సెప్టెంబర్ లోపు ముగించే అవకాశం ఉంది. ఈలోపు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న పుష్ప-2 అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అక్టోబర్ అంటున్నారు. అంటే అప్పటికే బుచ్చిబాబు సినిమా షూటింగ్ ముగింపుకు చేరుకునే అవకాశం ఉంది. సరిగ్గా అదే సమయంలో సుకుమార్ సినిమా పట్టాలెక్కించడానికి లైన్ క్లియర్ గా ఉంటుంది.
ఇదే ప్రణాళికతో చరణ్ రెండు ప్రాజెక్ట్ లు ఒకేసారి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా బుచ్చిబాబు-సుకుమార్ ఇద్దరు శిష్యలు కాబట్టి అడ్జస్ట్ చేసుకుని పనిచేయించుకునే వెసులు బాటు కూడా ఉంటుంది. ఒకేవేళ ఎక్కడైనా క్లాష్ అయినా ఎవరో ఒకరు తగ్గితే సరిపోతుంది. ఈ రకమైన వెసులు బాటు ఉంది కాబట్టే చరణ్ ఆవిధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇలా చేయగలిగితే 2025 లో ఆరెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కష్టమనే చెప్పాలి.