రామ్ చరణ్ కోసం మరో బాలీవుడ్ స్టార్?
ఇదే సమయంలో నటీనటులకి కూడా ఒక్క భాషకి పరిమితం కాకుండా కెరియర్ లో ఇతర భాషా చిత్రాలలో నటించిన ట్రాక్ రికార్డ్ ఉంటుంది
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాతనటీనటుల ఎంపిక పూర్తిగా మారిపోతోంది. భాషలతో సంబంధం లేకుండా ఆర్టిస్ట్స్ ని ఎంపిక చేసుకుంటున్నారు. సౌత్ సినిమాలలో బాలీవుడ్ స్టార్స్ నటించడానికి మొగ్గు చూపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సినిమాలలో సౌత్ యాక్టర్స్ కూడా కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ కాంబినేషన్స్ వలన సినిమాకి మార్కెట్ స్కోప్ దొరుకుతుందని దర్శక, నిర్మాతల అంచనా.
ఇదే సమయంలో నటీనటులకి కూడా ఒక్క భాషకి పరిమితం కాకుండా కెరియర్ లో ఇతర భాషా చిత్రాలలో నటించిన ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అలాగే వారిని వారు గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. ఇప్పటికే సౌత్ చిత్రాలలో సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, ఇమ్రాన్ హస్మి, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్ ఎంట్రీ ఇచ్చేశారు. వారి టాలెంట్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కూడా తెలుగులో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా సౌత్ భాషలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమితాబచ్చన్ కూడా ఇప్పటికే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి టైగర్ ష్రాఫ్ కూడా రాబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ సౌత్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలలో మెప్పించాడు.
ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కూడా ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న RC 16 సినిమాలో విలన్ పాత్ర కోసం టైగర్ ష్రాఫ్ ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. అతనితో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఒక వేళ అదే జరిగితే సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పొచ్చు. టైగర్ ష్రాఫ్ కి బాలీవుడ్ మంచి మార్కెట్ ఉంది. కమర్షియల్ యాక్షన్ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. RC 16 సినిమాలో అతని ఎంపిక నిజమైతే మాత్రం సినిమా బడ్జెట్ లెవల్స్ కూడా పెరిగిపోయే ఛాన్స్ ఉంది.