హాలీవుడ్ ని షేక్ చేస్తున్న చరణ్ క్రేజ్..!

ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ పాత్ర ఎంతగా ఇంపాక్ట్ చేసిందో ఈ ప్రకటనని బట్టి చెప్పొచ్చు. ఆ పాత్ర కోసం చరణ్ తెర వెనుక పడిన కష్టం చాలా గొప్పది.

Update: 2024-03-01 10:05 GMT
హాలీవుడ్ ని షేక్ చేస్తున్న చరణ్ క్రేజ్..!
  • whatsapp icon

RRR ముందు వరకు కేవలం ప్రాంతీయ హీరోలుగా ఉన్న చరణ్, ఎన్.టి.ఆర్ లను ఆ సినిమాతో గ్లోబల్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకునేలా చేశాడు రాజమౌళి. చరణ్ చేసిన రామరాజు పాత్ర.. తారక్ చేసిన భీం పాత్ర ఇద్దరి పాత్రలకు వారి ఎఫర్ట్స్ తెర మీద అద్భుతంగా ఆవిష్కరించపడ్డాయి. RRR సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్టైనా ఆ సినిమా పాటకు ఆస్కార్ వచ్చిన టైం లో మన స్టార్స్ కి గ్లోబల్ వైజ్ గుర్తింపు వచ్చింది. చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరి గురించి హాలీవుడ్ మీడియాలో కూడా క్రేజీ డిస్కషన్ నడిచింది.

ఇక లేటెస్ట్ గా ఆ క్రేజ్ కొనసాగిస్తూ ఒక హాలీవుడ్ సినిమాకు కాస్టింగ్ కాల్ ఇస్తూ నటీనటులకు కావాల్సిన క్వాలిటీస్ ని ఫోటో రూపంలో చూపిస్తూ RRR లో రామ్ చరణ్ నటించిన పోలీస్ ఫోటో వేసి అలాంటి లుక్, ఫిజిక్ ఉన్న నటీనటులు కావాలని ప్రకటించారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ పాత్ర ఎంతగా ఇంపాక్ట్ చేసిందో ఈ ప్రకటనని బట్టి చెప్పొచ్చు. ఆ పాత్ర కోసం చరణ్ తెర వెనుక పడిన కష్టం చాలా గొప్పది. అందుకే అతనికి అంత గొప్ప గుర్తింపు వచ్చేలా చేసింది.

సినిమా రిలీజై రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ తమ సినిమాలో కావాల్సిన యాక్టర్ కి రామరాజు పాత్ర తాలూఖా ఫిజిక్ కావాలని చెప్పడం చూస్తుంటే ఆ పాత్రకు చరణ్ చేసిన న్యాయం ఎంతన్నది అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ వైడ్ గా చరణ్ క్రేజ్ మరోసారి చాటి చెప్పేలా ఈ సినిమా ఆడిషన్ కాల్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దసరాకి రిలీజ్ అవుతుంది అనుకున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ సినిమా లైన్ లో ఉంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాను కూడా గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాలో చరణ్ పాత్ర డిఫరెంట్ వేరియేషన్స్ తో అదిరిపోతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News