రామ్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమా..?

పూరీ జగన్నాథ్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకుంది.

Update: 2024-06-18 16:30 GMT

పూరీ జగన్నాథ్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకుంది. ఈ సినిమా కోసం పూరీ రామ్ ఫ్యాన్స్ తో పాటుగా పూరీ సినిమాలను ఇష్టపడే అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ తో రామ్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అసలేమాత్రం ఫాం లో లేని పూరీతో రామ్ రెండోసారి కలిసి పని చేస్తున్నాడు. అంతకుముందు ఇద్దరు ఇస్మార్ట్ శంకర్ కి పనిచేశారు. ఆ సినిమా టైం లో కూడా ఇద్దరికి కంపల్సరీ హిట్ పడాలి. ఆ టైం లో పూరీ తన మార్క్ టేకింగ్ తో ఆ సినిమా చేశాడు.

ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అంతే కచ్చితంగా టాలెంట్ చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. రామ్ ది వారియర్, స్కంద ఫ్లాపులతో ఉండగా.. పూరీ లైగర్ అంటూ పాన్ ఇండియా వైడ్ హడావిడి చేసి సినిమాను నీరుగార్చాడు. డైరెక్టర్, హీరో ఇద్దరు మంచి ఆకలి మీద ఉన్నారు. ఇద్దరు కూడా మంచి టాలెంట్ ఉన్న వారే. సరైన సినిమా పడితే ఇద్దరు రికార్డులు సృష్టించే స్టామినా ఉన్న వారే. అందుకే ఇద్దరు కలిసి డబుల్ ఇస్మార్ట్ చేశారు.

డబుల్ ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్ కంటెంట్ మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఐతే ప్రచార చిత్రాలు ఎలా ఉన్నా పూరీ మీద పూర్తి నమ్మకం పెట్టలేకపోతున్నారు ఆడియన్స్. ఐతే ఇది పూరీ మీద కాదు రామ్ మీద పెట్టాల్సిన నమ్మకం అని అంటున్నారు. ఆల్రెడీ రెండు వరుస ఫ్లాపులు ఉన్న రామ్ తప్పకుండా ఎగ్జైట్మెంట్ ఉంటేనే డబుల్ ఇస్మార్ట్ కమిట్ అయ్యి ఉంటాడు. అందుకే సినిమాపై ఎవరేమి చెప్పినా.. ఎలాంటి వార్తలు రాసినా రామ్ మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

రామ్ డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. లైగర్ తో కుదరని మాస్ సక్సెస్ ని డబుల్ ఇస్మార్ట్ తో చేసి చూపించేలా పూరీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ లాంటి స్టార్స్ వల్ల సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News