అభిమానం పేరుతో అభిమానులు సైకోలుగా!
హత్య కేసులో ఉన్న వ్యక్తికి సహకరించే సమాజంలో మనం ఉన్నామా? ఇలా ఉన్నందుకు సిగ్గుగా అనిపించలేదా?
హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ తప్పు చేస్తే గనుక తప్పకుండా కఠిన శిక్ష పడాలంటూ నటి రమ్యనంబీసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దర్శన్ అభిమానులు రమ్యపై సోషల్ మీడియా వేదకిగా ఎటకింగ్ దిగారు. పెద్ద ఎత్తున అమెని ట్రోల్స్ చేసారు. బూతులు తిట్టారు. రకరకాల అసభ్య కామెంట్లతో వేదించారు. తాజాగా వాటిపై రమ్య స్పందించింది.
హత్య కేసులో ఉన్న వ్యక్తికి సహకరించే సమాజంలో మనం ఉన్నామా? ఇలా ఉన్నందుకు సిగ్గుగా అనిపించలేదా? సెలబ్రిటీ అయితే సాధారణ ప్రజల్ని కొట్టి చంపాలా? సెలబ్రిటీ అయితే మీలాంటి వాళ్లను రెచ్చగొట్టాలా? అసలైన హీరోయిజం అంటే ఇలాగే ఉంటుందా? మీరంతా నిజమైన అభిమానులే అయితే రోజు ఎన్నో సమస్యలొస్తున్నాయి? వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
చేతిలో నే ఫోన్ ఉంది? నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మీలాంటి వాళ్లు అంతా అలాంటి పనులు చేయగల సమర్దులేనని నేను నమ్ముతున్నా? అని చెడామడా చెడుగుడు అడేసింది. ఇలాంటి కేసుల విషయంలో ఎలాంటి రాజకీయ పార్టీకి తలొగ్గకుండా పనిచేస్తారని పోలీసుల్ని ప్రజలంతా నమ్ముతున్నారు.
ఇంతవరకూ అలాగే పనిచేసారు. అందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మాజీ నిర్మాత యాడ్యురప్ప, మాజీ ఎంపీ ప్రజ్వల రేవణ్ణ,సూరజ్ రేవణ్ణ వంటి ప్రముఖులు కొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. వీళ్లందర్నీ కూడా జోడీస్తూ రమ్య ఆ వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రమ్య అభిమానులు, మద్దతుదారులంతా ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ పోస్టులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున ఆమెకి మద్దతు లభిస్తుంది.