టాలీవుడ్ లో బెస్ట్ తెలుగు టీచర్ అంటే ఆ హీరోనే..

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి నిర్మించిన '35 చిన్న కథ కాదు' మూవీ సెప్టెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది.

Update: 2024-09-04 04:46 GMT

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి నిర్మించిన '35 చిన్న కథ కాదు' మూవీ సెప్టెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి మెయిన్ లీడ్ గా ఈ సినిమా తెరకెక్కింది. చిన్న బడ్జెట్ తో ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని నందకిషోర్ ఈమని రెడీ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కథలో మంచి ఎమోషన్ ఉందనే మాట వినిపిస్తోంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక మధ్యతరగతి గృహిణిగా నివేదా థామస్ ఈ చిత్రంలో కనిపిస్తోంది. ఆమె పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించినట్లు కనిపిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా థామస్ పాత్ర ఉంటుంది. చాలా రోజుల తర్వాత నివేదా తెలుగులో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా 35 చిన్న కథ కాదు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ ఈవెంట్ లో 35 చిన్న కథకి రిలేటెడ్ తో టాలీవుడ్ సెలబ్రెటీలని టీచర్స్ తో పోల్చి చెప్పారు. ఇందులో రాజమౌళి అన్ని సబ్జెక్టులు చెప్పే ట్యూషన్ టీచర్ లాంటివారని రానా అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అయితే బెస్ట్ తెలుగు టీచర్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కంటే తెలుగు ఇంకెవరు బాగా మాట్లాడలేరని రానా కితాబు ఇచ్చారు. అందుకే తెలుగు టీచర్ గా ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అని రానా అన్నారు.

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ జెనరేషన్ స్టార్ హీరోలలో తెలుగు అనర్గళంగా మాట్లాడి ఎంత పెద్ద డైలాగ్ అయిన సునాయాసంగా చెప్పే సామర్ధ్యం జూనియర్ ఎన్టీఆర్ కే ఉందని చాలా మంది ఒప్పుకుంటారు. అతను తెలుగు ఉచ్ఛరించే విధానం, అలాగే డైలాగ్ మాడ్యులేషన్ కరెక్ట్ ఎమోషన్ తో ఉంటుందని సినీ విశ్లేషకులు కూడా ప్రశంసిస్తూ ఉంటారు.

అందుకే రానా సైతం జూనియర్ ఎన్టీఆర్ ని బెస్ట్ తెలుగు టీచర్ అంటూ పొగిడారు. ఇదిలా ఉంటే 35 చిన్న కథ కాదు సినిమాని రానా దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నారు. రానా పూర్తిగా నిర్మాణ బాధ్యతలు తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News